సౌకర్యంగా కలలు కందాం...

అసలే బయట ఎండలు ఠారెత్తుతున్నాయి. ఆఫీసు నుంచి ఇంటికొచ్చి, పనంతా చేసేస్తాం. ఆపై స్నానం చేసి రిలాక్స్‌ అవుతాం.

Published : 12 Apr 2024 01:31 IST

అసలే బయట ఎండలు ఠారెత్తుతున్నాయి. ఆఫీసు నుంచి ఇంటికొచ్చి, పనంతా చేసేస్తాం. ఆపై స్నానం చేసి రిలాక్స్‌ అవుతాం. అందుకు మనం ఎంచుకునేది సాధారణంగా నైటీయే అవుతుంది కదా! కేవలం నిద్రపోయే ముందే కాదు, కొందరు తల్లులు కూడా సౌకర్యంగా ఉంటాయని రోజంతా అవే వేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు అనుకోకుండా బయటకు వెళ్లాలన్నా, పిల్లల్ని అలా బస్‌దాకా వెళ్లి ఎక్కించి వద్దామన్నా, లేదా ఇంటి ముందు మార్కెట్‌కి వెళ్లి అత్యవసరమైన వస్తువు ఏదైనా తీసుకొద్దామన్నా ఈ నైటీతో బయటకి వెళ్లడానికి సంకోచం. అలా అని ప్రతిసారీ అవసరం వచ్చినప్పుడు డ్రెస్‌ మార్చుకోవాలంటే సమయం వృథానే కదా. పైగా సాధారణ నైటీలతో వచ్చే చిక్కేంటంటే పైనుంచి కిందకి ఒకేలా ఉండి చూడడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా త్రీ ఫోర్త్‌, అంతకంటే తక్కువ లెంత్‌లో కూడా చూడడానికి గౌనులా ఉండే నైట్‌వేర్‌లు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చేశాయి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఓ లెగ్గింగ్‌ వేసుకోవచ్చు. క్రేప్‌, కాటన్‌, శాటిన్‌, సిల్క్‌, రేయాన్‌.. లాంటి ఎన్నో రకాల్లో అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ బరువుతో, అచ్చం డ్రెస్సుల్లానే ఉండే ఈ నైట్‌వేర్‌లు ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నాయి. సౌకర్యంగా ఉండడంతోపాటు మంచి లుక్‌నీ ఇస్తాయివి. నచ్చాయా! ఆన్‌లైన్లో వెతికేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్