మెరుపులీనే చలువటద్దాలు...!

ఈ వేసవిలో మండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ వేడిలో కూలింగ్‌ గ్లాసెస్‌ కళ్లను కాపాడతాయి. చల్లదనాన్నీ అందిస్తాయి. అంతేకాదు, ముఖానికీ ప్రత్యేకమైన ఆకర్షణనూ తెచ్చిపెడతాయి.

Updated : 22 Apr 2024 18:21 IST

ఈ వేసవిలో మండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ వేడిలో కూలింగ్‌ గ్లాసెస్‌ కళ్లను కాపాడతాయి. చల్లదనాన్నీ అందిస్తాయి. అంతేకాదు, ముఖానికీ ప్రత్యేకమైన ఆకర్షణనూ తెచ్చిపెడతాయి. అటువంటి వీటికి మరింత అలంకరణను జోడిస్తే ఫ్యాషన్‌కు చిరునామా మీరే అవుతారు. ఎలాగంటే...

ఎండ నుంచి రక్షణగా పెట్టుకునే కళ్లద్దాల్లో ఎన్నో ఛాయలు, మరెన్నో ఆకృతులూ ఉంటాయని తెలిసిందే. మరి వీటికి కాస్త జిగేల్‌మనిపించే హంగులూ చేర్చితే కొత్తదనంతో మెరిసిపోరూ!

నలుపు, ముదురు ఎరుపు ఛాయల్లో ఉండే చలువటద్దాల చుట్టూ ముత్యాలను అతికిస్తే ఎంత బాగుంటాయో! ఇందుకోసం మర్కెట్లో దొరికే హాఫ్‌పెరల్స్‌ని గ్లూతో అద్దాల చుట్టూ అతికించి ఆరనిస్తే సరి. స్టైలిష్‌ లుక్‌లో తళుక్కుమనొచ్చు. అలాగే, బంగారు, వెండి రంగుల్లో పూసలు, రంగు రంగుల క్రిస్టల్స్‌ వంటివీ ఓ డిజైన్‌లా అతికించినా... మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక, కాస్త ఫంకీ స్టైల్‌లో కనిపించాలనుకుంటే... లెటర్స్‌ ప్రింట్‌తో చేసిన కలర్‌ బీడ్స్‌ని మీకు నచ్చినట్లుగా అద్దాల చుట్టూ అతికించేయండి. వీటికి గుండ్రటి కళ్లద్దాలకంటే, హృదయాకారంలో ఉన్నవి బాగుంటాయి. సంగీత్‌, మెహందీ వంటి కార్యక్రమాలకూ, బీచ్‌లకూ వెళ్లినప్పుడూ... ఇవి మీకు కొత్తందం తెచ్చిపెట్టడంతో పాటు అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్