వ్యాక్స్‌కి ముందూ వెనకా...

అవాంఛిత రోమాలు తొలగించుకునేవారికి వాక్స్‌ పరిచయమే! మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ రోజులు పలకరించకుండా ఉంటాయని నొప్పిని భరించి మరీ చేయించుకుంటారు. మరి వాక్స్‌కి ముందూ వెనకా సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా.

Updated : 22 Apr 2024 18:24 IST

అవాంఛిత రోమాలు తొలగించుకునేవారికి వ్యాక్స్‌ పరిచయమే! మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ రోజులు పలకరించకుండా ఉంటాయని నొప్పిని భరించి మరీ చేయించుకుంటారు. మరి వ్యాక్స్‌కి ముందూ వెనకా సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా...

సిద్ధం చేయండిలా..

  • వ్యాక్స్‌కి ముందు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. లేదంటే చెమట, దుమ్ము వంటివి వ్యాక్స్‌ని శరీరానికి సరిగ్గా అతుక్కోనివ్వవు. మళ్లీ మళ్లీ ప్రయత్నించాల్సి వస్తుంది. కాబట్టి, నొప్పి అదనం. అందుకే శుభ్రత తప్పనిసరి. దీన్ని చేయించుకోవడానికి కనీసం వారం రోజుల ముందు వరకూ ట్రిమ్మింగ్‌, షేవింగ్‌ లాంటివి చేయొద్దు. వెంట్రుకలు కాస్తయిన పొడవు పెరగకపోతే వ్యాక్స్‌కి ఇబ్బంది.
  • చర్మంపై గాయాలు, అలర్జీ, దద్దుర్లు ఉన్నాయా... అయితే వాయిదా వేసుకోవడమే మేలు. అందం కోసమని వాటిని నిర్లక్ష్యం చేశారో... సమస్య మరింత పెరుగుతుంది. వ్యాక్స్‌ చేయించుకోవడానికి రెండు రోజుల ముందు స్క్రబ్‌ చేసుకోండి. అది శరీరానికి కాకుండా కేశాలకే అంటుకుంటుంది. మంటా తగ్గుతుంది.
  • చర్మం పొడిబారినా నొప్పి, మంట పెరుగుతాయి. కాబట్టి, తేమనందించే క్రీములు తప్పక రాయాలి. అయితే వ్యాక్స్‌ చేయించుకునే రోజు, ఆ ముందు రోజు మాత్రం ఏవీ వాడొద్దు. ఇంట్లో స్వయంగా చేసుకుంటున్నా, పరికరాలు శుభ్రంగా ఉన్నాయా అన్నది గమనించుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా చేరి, ఇన్‌ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది.

సంరక్షణ కావాలి...

  • వ్యాక్స్‌ తరవాత క్రీమ్‌ అంతా పట్టినట్టు ఉంటుందని స్నానం చేస్తాం కానీ వద్దు. నీరు కేశాల కుదుళ్లలోకి పోయి అలర్జీలకు కారణమవుతుంది. అలాగే వదులు దుస్తులనే వేసుకోండి. లెగ్గింగ్‌, జీన్స్‌ వంటి బిగుతు దుస్తులూ రాపిడి కలిగించి, చర్మం ఎర్రబారడానికీ, దద్దుర్లకూ కారణమవుతాయి.
  • వ్యాక్స్‌ పూర్తయ్యాక ఐస్‌ ప్యాక్‌తో ఆ ప్రాంతాన్ని రుద్దండి. అప్పటికే వాపు, దద్దుర్లు వంటివి ఉంటే త్వరగా నయమవుతాయి. అలాగే ఆ ప్రాంతాన్ని పదే పదే తాకడం, ఎండలోకి వెళ్లడం లాంటివి చేయొద్దు. వ్యాయామమూ చేయకూడదు. చెమటతో సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.
  • వేడుకలున్నాయని హడావుడిగా చేయించుకున్నారా? అలాగని క్రీములు, పెర్‌ఫ్యూమ్‌లు తగిలేలా చేశారో... వాటిల్లోని ఆల్కహాల్‌, రసాయనాలు చర్మాన్ని ఇబ్బంది పెడతాయి. తప్పనిసరి అయితే నిపుణుల సలహా మేరకు ముందు జెల్స్‌ రాయడం మేలు. ఇవి పాటించి చూడండి. మృదువైన, ఆరోగ్యకరమైన చర్మం సొంతమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్