బుట్ట బొమ్మకు... బియ్యపు ముత్యాలు!

బీరువాలో ధగధగలాడే నవరత్నాల నగలెన్ని ఉన్నా...అందులో పాల మీగడ మెరుపుతో వన్నెలు చిందించే ముత్యాల ఆభరణాలది ప్రత్యేక స్థానం.

Published : 16 Apr 2024 01:53 IST

బీరువాలో ధగధగలాడే నవరత్నాల నగలెన్ని ఉన్నా...అందులో పాల మీగడ మెరుపుతో వన్నెలు చిందించే ముత్యాల ఆభరణాలది ప్రత్యేక స్థానం. అందుకే సంప్రదాయాన్ని మెచ్చేవారు, ఆధునికతను అందిపుచ్చుకున్న వారూ... వీటిని ఎంపిక చేసుకోవడానికీ వెనకాడరు.

 అమ్మ, అమ్మమ్మల కాలంలోనూ ఈ ముత్యాల మురిపెం ఎక్కువే. ముఖ్యంగా అప్పట్లో వయసొచ్చిన ప్రతి ఆడపిల్లా ఓ మంచి ముత్యాల దండ వేసుకోవడం ట్రెండ్‌. ఇవీ గుండ్రంగా ఉండేవనుకునేరు. బియ్యపు గింజ ఆకృతుల్లోనే ఉండేవి. అయితే, స్థోమతను బట్టి వీటిని కొందరు దారంతో గుదిగుచ్చితే, మరికొందరు రాగి, వెండి, బంగారు తీగలతో చుట్టించుకునేవారు. ఎవరెలా ఎంచుకున్నా... పసిడిని మించిన ఆకర్షణతో ఈ ముత్యాల నగలు ఆడపిల్లలకు రెట్టింపు అందాన్ని తెచ్చిపెట్టేవి. అందుకే అప్పటి తరం దీన్ని ఆభరణంలా కాకుండా ఓ మంచి జ్ఞాపకంగా ఇప్పటికీ గుర్తుంచుకుంటారు.

అయితే, ఏ ఫ్యాషన్‌ అయినా ఎక్కువ కాలం నిలబడదన్న మాట నిజం చేస్తూ... కాలక్రమంలో ముత్యాల్లోనూ ఎన్నో రంగులూ, ఆకృతులూ వచ్చాయి. ఇప్పుడు రైస్‌ పెరల్స్‌ మళ్లీ కొత్తందాలు చుట్టుకుని వచ్చేశాయి. కాకపోతే ఈసారి కాస్త చిన్న పరిమాణంలో కనువిందు చేస్తున్నాయి. వీటినిప్పుడు పాశ్చాత్య దేశాల్లో ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. ఆధునిక ఆభరణాల్లో అందంగా పొదుగుతున్నారు. బంగారంతోనైనా, వెండితోనైనా చక్కగా జతకట్టే ఇవి బియ్యపు గింజ ఆకృతుల్లోనే గుత్తుల్లో ఒదిగిపోతూ... పసిడి హారాల్లో కలిసి పోతూ వాటికి అదనపు అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. అచ్చంగా ముత్యాల వరుసలే కాదు... చంద్రహారాలు, చోకర్లు, నెక్లెస్‌లు, కంటె... వంటి ఆనాటి నుంచి ఈ నాటి వరకూ ఉన్న అన్ని రకాల గోల్డ్‌ జ్యూయలరీ అంచుల్లో చేరి అదరహో అనిపిస్తున్నాయి. సంప్రదాయ వస్త్రధారణకు నిండుదనం తెస్తున్నాయి. మరి అలా చక్కగా ఒదిగిపోయిన ఆ చిట్టి ముత్యాల సోయగం మనమూ చూద్దామా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్