జోరుమీదున్నాయి... జిప్‌ నగలు!

తరాలెన్ని మారినా... నగలపై మగువలకు తరగని ప్రేమ. కొత్తదనాన్ని కోరుకోవడమే కాదు... ప్రయోగాలు చేయడానికీ ముందుంటారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు ఎన్నో పుట్టుకొస్తుంటాయి. అలాంటిదే ఈ జిప్‌ జ్యుయెలరీ.

Published : 19 Apr 2024 01:55 IST

తరాలెన్ని మారినా... నగలపై మగువలకు తరగని ప్రేమ. కొత్తదనాన్ని కోరుకోవడమే కాదు... ప్రయోగాలు చేయడానికీ ముందుంటారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు ఎన్నో పుట్టుకొస్తుంటాయి. అలాంటిదే ఈ జిప్‌ జ్యుయెలరీ. చూడగానే నయా స్టైల్‌ అనిపిస్తోంది కదూ! కానీ, అందమైన ఈ నగ తయారీకి పునాది పడింది మాత్రం 1930లోనే అంటే ఆశ్యర్యంగా ఉందా? ఆ ఏడాది చివర్లో ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ వాన్‌క్లీఫ్‌ అండ్‌ ఆర్పెల్స్‌ సంస్థ డైరెక్టర్‌ రైనీ పుయిసెంట్‌ జిప్పర్‌ని పోలిన నగని రూపొందించాలని నిర్ణయించుకున్నారట. అయితే, ఈ ఆలోచన... అప్పటి అమెరికన్‌ సోషలైట్‌, బ్రిటిష్‌ చక్రవర్తి ఎడ్వర్డ్‌-8 భార్య వాలిస్‌ కోసమట.

దుస్తులూ, నగల్లో ఎప్పటికప్పుడు నయా డిజైన్లను కోరుకునే ఆవిడ ఆలోచనతోనే దీన్ని మొదలుపెట్టారు. విలువైన లోహాలు, కెంపులూ వాడి ఈ జిప్‌ నెక్లెస్‌ డిజైన్‌ చేయడానికి పదేళ్ల కాలం పట్టింది. తెరిస్తే హారంలా, మూస్తే బ్రేస్‌లెట్‌లా ఉంటుంది. అయితే, తరవాత నిపుణుల కొరత, ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాలతో ఈ డిజైన్లను పరిమిత సంఖ్యలో తీసుకొచ్చారు. 2015లో అకాడమీ అవార్డుల వేడుకలో హాలీవుడ్‌ నటి మార్గోట్‌ రాబీ 300 నీలాలు, 150 వజ్రాలు పొదిగిన పురాతన కొలంబైన్‌ జిప్‌ నెక్లెస్‌ని ధరించడంతో మళ్లీ దీనికి ప్రాచుర్యం లభించింది. తాజాగా మరోసారి ఫ్యాషన్‌ మార్కెట్‌లో సందడి చేస్తోన్న ఈ జిప్‌ నెక్లెస్‌లు ఆధునిక యువతుల మనసుని కొల్లగొట్టేస్తున్నాయి. ఆ డిజైన్లలో కొన్ని ఇవి. ఓసారిటు చూస్తే మీకూ నచ్చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్