పసిడి మెరుపులు... పంచలోహ పట్టీలు!

అందెలు... ఆడపిల్లలకు రెట్టింపు అందాన్ని తెచ్చిపెడతాయనడంలో సందేహం ఏముంది? ఇవి అమ్మాయిల మనసు దోచుకోవడమే కాదు... మగవారి గుండెల్లోనూ అలజడి రేపుతుంటాయట. అందుకే ‘కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే..’,  ‘గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె జల్లుమన్నాదిరో’ అంటూ సినీ కవులు పట్టీల ప్రత్యేకతను చెప్పకనే చెప్పారు.

Published : 23 Apr 2024 01:31 IST

అందెలు... ఆడపిల్లలకు రెట్టింపు అందాన్ని తెచ్చిపెడతాయనడంలో సందేహం ఏముంది? ఇవి అమ్మాయిల మనసు దోచుకోవడమే కాదు... మగవారి గుండెల్లోనూ అలజడి రేపుతుంటాయట. అందుకే ‘కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే..’,  ‘గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె జల్లుమన్నాదిరో’ అంటూ సినీ కవులు పట్టీల ప్రత్యేకతను చెప్పకనే చెప్పారు. పట్టీలు, అందియలు, గజ్జెలు... అంటూ ప్రాంతానికో పేరుతో పిలిచే ఇవంటే మగువలకు ఎంతో మురిపెం. ఒకప్పుడు పెద్దా, చిన్నా తేడాలేకుండా ప్రతి మహిళా వీటిని ధరించేవారు. అయితే, వీటిల్లో ఎక్కువగా వెండివే కనిపిస్తుంటాయి. ఇవి నాడుల్ని ప్రేరేపితం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయనేది పెద్దల నమ్మకం. బంగారాన్ని ధరించేవారు అరుదుగా ఉన్నా.... ఈ మధ్య కాలంలో అచ్చంగా పసిడిని తలపించేలా పంచలోహాలతో చేసిన పట్టీలకూ ప్రాధాన్యం పెరిగింది. పంచలోహాలంటే.. బంగారం, వెండి, రాగి, జింక్‌, ఇనుము అనే ఐదు లోహాల కలయిక. ఇవి అచ్చంగా పుత్తడిని పోలి ఉండటం, మెరుపూ ఎక్కువ కాలం నిలిచి ఉండటంతో వీటితో చేసిన అందెలకూ ఆదరణ లభిస్తోంది. అంతేనా, దీంతో చేసిన ఆభరణాలు ధరించడం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయట. ఎప్పట్నుంచో ఇవి ఉన్నా... కాలక్రమంలో వచ్చిన నయా డిజైన్లనూ అద్దుకుని తాజాగా మరోసారి సందడిచేస్తున్నాయి. ఈతరం అమ్మాయిలతో జత కట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. పూసలు, ముత్యాలు, రాళ్లూ... వంటి హంగులను చేర్చుకుని జిగేల్‌ మనిపిస్తోన్న వీటిని పెట్టుకుంటే మీ పాదాలు సొగసులీనవూ! మరి వాటినోసారి మీరూ చూసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్