పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!

ముఖసౌందర్యాన్ని పెంచడంలో కురులకెంతో ప్రాముఖ్యత ఉంది. అలా తన పొడవైన కురులతో ఏకంగా స్లొవాకియాకు చెందిన అలీయా నజిరోవా గిన్నిస్‌బుక్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 8 అడుగుల, 5.3 అంగుళాల పొడవున్న జుట్టుతో ప్రపంచంలోనే అతి పొడవైన శిరోజాలున్న మహిళగా నిలిచిందీమె. ‘ప్రకృతిలో ప్రతి మహిళా అందగత్తే..! అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. సహజ సౌందర్యాన్ని చూసి స్ఫూర్తి పొందేవారందరికీ ఈ రికార్డు అంకితమిస్తున్నా.

Published : 25 Apr 2024 02:12 IST

ముఖసౌందర్యాన్ని పెంచడంలో కురులకెంతో ప్రాముఖ్యత ఉంది. అలా తన పొడవైన కురులతో ఏకంగా స్లొవాకియాకు చెందిన అలీయా నజిరోవా గిన్నిస్‌బుక్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 8 అడుగుల, 5.3 అంగుళాల పొడవున్న జుట్టుతో ప్రపంచంలోనే అతి పొడవైన శిరోజాలున్న మహిళగా నిలిచిందీమె. ‘ప్రకృతిలో ప్రతి మహిళా అందగత్తే..! అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. సహజ సౌందర్యాన్ని చూసి స్ఫూర్తి పొందేవారందరికీ ఈ రికార్డు అంకితమిస్తున్నా. పొడవైన జుట్టు మా వంశపారంపర్యంగా వస్తోంది. అమ్మమ్మ, నానమ్మకూ శిరోజాలు పొడవుగా ఉండేవి. అమ్మాయికెప్పుడూ జుట్టు పొడవుగా ఉంటేనే అందమని అమ్మ చెప్పేది. అందుకే చిన్నప్పటి నుంచీ నేను జుట్టు కత్తిరించుకోవడానికి ఇష్టపడలేదు. అలాగని రోజూ జుట్టును దువ్వాలన్నా కష్టమే. వారానికొకసారి చిక్కు తీసి తిరిగి జడ వేయడానికి కనీసం అరగంటకుపైగా సమయం పడుతుంది. అలాగే తల స్నానానికి అరగంట, ఆపై మాస్క్‌ వేయాలంటే మరో రెండు గంటలు కావాల్సి వస్తుంది. జుట్టు ఆరడానికి డ్రైయర్‌ వినియోగించను. తడి ఆరడానికి 24 గంటలు పట్టినా, సహజసిద్ధంగా ఆరబెట్టడానికే ప్రాముఖ్యతనిస్తా’నని చెబుతున్న 35ఏళ్ల ఈ పొడవు శిరోజాల సుందరి వృత్తిరీత్యా పెయింటర్‌. తన పొడవైన జుట్టుతో మోడల్‌గానూ పని చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్