ఉంగరం... ఆడంబరం!

బీరువాలో ఎన్ని నగలున్నా... ఉంగరానికి ఉండే ప్రత్యేకతే వేరు. దీన్ని అనుబంధాలకూ, శుభకార్యాలకూ ప్రతీకగా రకరకాల డిజైన్లలో ఎంచుకుంటారు. ఇందులో ఎక్కువగా సింపుల్‌ డిజైన్లూ, నవరత్నాలు, దేవతా విగ్రహాలతో తీర్చిదిద్దినవే కనిపిస్తాయి.

Published : 07 May 2024 01:43 IST

బీరువాలో ఎన్ని నగలున్నా... ఉంగరానికి ఉండే ప్రత్యేకతే వేరు. దీన్ని అనుబంధాలకూ, శుభకార్యాలకూ ప్రతీకగా రకరకాల డిజైన్లలో ఎంచుకుంటారు. ఇందులో ఎక్కువగా సింపుల్‌ డిజైన్లూ, నవరత్నాలు, దేవతా విగ్రహాలతో తీర్చిదిద్దినవే కనిపిస్తాయి. అయితే, కాలంతో పాటు అమ్మాయిల అభిరుచులూ మారాయి. నగలు అందంగానే కాదు... ఆడంబరంగానూ ఉండాలని కోరుకుంటోంది ఈతరం.

అందుకే, వారిని మెప్పించేందుకు హారాలు, నెక్లెస్‌లకు వాడే జడావు పనితనం ఉంగరాలపైనా అద్దుకుంటోంది. జడావు అంటే... పొందుపరచడం, లేదా బంగారాన్ని ఫ్రేమ్‌గా ఉపయోగించడం అనే అర్థాలున్నాయట. ఈ డిజైన్‌లను అన్‌కట్‌ వజ్రాలు, విలువైన రత్నాలు, రాళ్లు, ముత్యాలు వంటివాటిని పొదిగి  చేస్తారు. అయితే, ఇప్పుడు అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు విలువైన వాటి స్థానంలో తెలుపు, పచ్చ, ఎరుపు రాళ్లను మేళవించి ఈ రింగులను చేస్తున్నారు.

ఇవి నవవధువుల ఆహార్యానికి అందంగా అమరిపోతాయి. మొగలాయిలతో పాటు మన దేశానికి వచ్చిన ఈ కళకు, భారతీయ పనితనం తోడై కొత్త రూపుని తెచ్చుకుంది. అందుకే, ఏళ్లు గడుస్తున్నా ఈ తరహా నగలకి ఏ మాత్రం గిరాకీ తగ్గడం లేదు. వీటిపై మనసూ మరలడం లేదంటారు మహిళలు. మీరూ వాటినోసారి చూసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్