బ్యాగుకో... ముస్తాబు!

మనకి పర్సు, హ్యాండు బ్యాగులు.. వస్తువులు పెట్టుకోవడానికి మాత్రమే కాదు. అదో ఫ్యాషన్‌ యాక్సెసరీ కూడా. అందుకే వాటినీ సేకరించేస్తుంటాం. దుస్తులకు తగ్గట్టుగా ఉండేలానూ ఎంపిక చేసుకుంటాం. అన్నిసార్లూ మ్యాచింగ్‌ అంటే మనకీ కష్టమే. ఆ కష్టం తీరుస్తూ మాయ చేయడానికి వచ్చినవే ఈ అలంకరణలు....

Updated : 18 May 2024 03:54 IST

ఫ్యాషన్‌ ట్రెండ్‌

మనకి పర్సు, హ్యాండు బ్యాగులు.. వస్తువులు పెట్టుకోవడానికి మాత్రమే కాదు. అదో ఫ్యాషన్‌ యాక్సెసరీ కూడా. అందుకే వాటినీ సేకరించేస్తుంటాం. దుస్తులకు తగ్గట్టుగా ఉండేలానూ ఎంపిక చేసుకుంటాం. అన్నిసార్లూ మ్యాచింగ్‌ అంటే మనకీ కష్టమే. ఆ కష్టం తీరుస్తూ మాయ చేయడానికి వచ్చినవే ఈ అలంకరణలు....


చేతులకు ఇబ్బంది లేదు...

చిన్నగా చేతిలో అమరిపోయే పర్సులు ఎన్ని ఉన్నా మరొకటి కావాలనే అనిపిస్తుంది కదూ! అందంగా స్టైల్‌గా బాగానే ఉంటాయి. కానీ... ఎక్కువసేపు చేత్తో పట్టుకుంటేనే నొప్పి. అప్పుడు మాత్రం భారమనిపిస్తాయి. అలాగని ఖర్చు పెట్టి కొన్నవి. పక్కన పడేయలేం కదా? ఈ క్రాస్‌ బాడీ కన్వర్షన్‌ కిట్‌ని తెచ్చేసుకోండి. పర్సులైనా చిన్న హ్యాండిల్‌ ఉన్న బ్యాగులైనా రంధ్రాలు పెట్టకుండానే ఈ లాంగ్‌ స్ట్రాప్‌ని తగిలించుకోవచ్చు. బకల్‌ని హ్యాండిల్‌కి ఇరువైపులా అమర్చి, బెల్ట్‌ను తగిలించుకుంటే సరిపోతుంది. ఫ్యాషన్‌కి తోడు సౌకర్యమన్నమాట.


రిబ్బన్‌ చుట్టేయండి

కాస్త స్టైలిష్‌గా కనిపించాలి... రోజూ బ్యాగుకో కొత్తదనం కావాలి అనిపిస్తుందా? అయితే హ్యాండ్‌బ్యాగ్‌ రిబ్బన్‌ స్కార్ఫ్‌లు తెచ్చేసుకోండి. మల్టీ ప్యాక్‌ బుక్‌ చేసుకుంటే సరి. బ్యాగు హ్యాండిల్‌కి చుట్టినా, ఓ పక్క రిబ్బనులా ముడేసినా, మామూలుగా ముడేసినా బ్యాగు లుక్కే మారిపోతుంది. అన్నట్టూ ఆసక్తి ఉంటే వీటిని జుట్టుకి రిబ్బన్‌లా చేతికి బ్రేస్‌లెట్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. రెండిందాలా లాభమే!


రంగు... మార్చేయొచ్చు

ఎంచెంచి అన్ని దుస్తులకు సరిపోయేలా న్యూట్రల్‌ కలర్స్‌లో కొనుక్కోవడానికే చాలామంది ఓటేస్తారు. ఎంత జాగ్రత్తపడినా కొన్ని దుస్తుల మీదకి కొన్ని బ్యాగులు నప్పవు. అలాంటప్పుడు ఈ డిటాచబుల్‌ స్ట్రాప్స్‌ను తెచ్చుకుంటే సరి. రెజిన్, స్టీల్, లెదర్‌... వంటి భిన్న మెటీరియల్స్‌లోనూ దొరుకుతున్నాయి. ఎంత పొడవు కావాలన్నదీ ఎంచుకునే వీలుంది. మీకు తగినవేంటో ఎంచుకుంటే సరి. క్లచ్‌ అయినా హ్యాండ్‌ బ్యాగయినా వీటిని తగిలించుకోవచ్చు. వాటి రూపు మార్చుకోవచ్చు. బాగున్నాయి కదూ... ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి. మీ బ్యాగు రూపుని మార్చుకోండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్