నలుపు పోయేదెలా..!

అసలే ఎండలు, దీనికి తోడు చెమట. జననేంద్రియాలు, బాహుమూలల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. సరిగా శుభ్రం చేయకపోతే దుర్వాసననే కాదు ఇన్‌ఫెక్షన్లూ తోడై ఆ భాగం నల్లగా మారుతుంది.

Published : 18 May 2024 01:19 IST

అసలే ఎండలు, దీనికి తోడు చెమట. జననేంద్రియాలు, బాహుమూలల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. సరిగా శుభ్రం చేయకపోతే దుర్వాసననే కాదు ఇన్‌ఫెక్షన్లూ తోడై ఆ భాగం నల్లగా మారుతుంది. సమస్య తీరాలా... చిట్కాలివిగో...

చెంచా బేకింగ్‌ సోడాకు తగినన్ని నీళ్లు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట స్క్రబ్‌ చేసి ఆరాక చల్లటి నీటితో కడిగితే సరి. లేదా నిమ్మచెక్కపై వంటసోడా వేసి నల్లగా ఉన్నచోట రుద్దితే సహజ బ్లీచ్‌గా పనిచేసి, చెడువాసననూ దూరం చేస్తుంది.

  • రెండు చెంచాల యాపిల్‌ సెడార్‌ వినెగర్‌కు అరచెంచా బేకింగ్‌ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న ప్రాంతాల్లో రాయాలి. ఐదునిమిషాలాగి శుభ్రం చేయాలి. ఇది సహజ క్లెన్సర్‌గా పనిచేసి మృతకణాలను తగ్గిస్తుంది.
  • ప్రతి బ్యూటీ ఉత్పత్తుల్లో ఆలివ్‌ ఆయిల్‌ను విరివిగా వాడుతుంటారు కదా! అయితే రెండుచెంచాల బ్రౌన్‌షుగర్‌కి చెంచా ఆలివ్‌నూనెను కలిపి నలుపున్నచోట ఐదునిమిషాలు స్క్రబ్‌ చేయాలి. ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేస్తే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్