మువ్వలు మురిపిస్తున్నాయి...

అందాన్ని రెట్టింపు చేసే ఆభరణాలంటే ఇష్టపడని ఆడవాళ్లుంటారా? అందులోనూ ఈ తరం అమ్మాయిలు ఫ్యాషన్‌ ప్రియులు. రాళ్లూ, రత్నాలు, బంగారు చెక్కుళ్లతో తీర్చిదిద్దిన హారాలూ, నెక్లెస్‌లూ... ఇలా బీరువాలో ఎన్నున్నా కొత్తదనం కోసం వెతుకుతూనే ఉంటారు.

Published : 21 May 2024 01:02 IST

అందాన్ని రెట్టింపు చేసే ఆభరణాలంటే ఇష్టపడని ఆడవాళ్లుంటారా? అందులోనూ ఈ తరం అమ్మాయిలు ఫ్యాషన్‌ ప్రియులు. రాళ్లూ, రత్నాలు, బంగారు చెక్కుళ్లతో తీర్చిదిద్దిన హారాలూ, నెక్లెస్‌లూ... ఇలా బీరువాలో ఎన్నున్నా కొత్తదనం కోసం వెతుకుతూనే ఉంటారు. అదీ... నగలపై ప్రేమంటే! ఈ విషయం తెలిసే డిజైనర్లు కూడా మహిళల్ని మెప్పించే డిజైన్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలెన్నో చేస్తుంటారు. పాతవాటికే మెరుగులద్ది నవ్యతను తెచ్చిపెడుతుంటారు. అలాంటివే ఈ పసిడి పూసల నగలు. ఒకప్పుడు అమ్మ, అమ్మమ్మల్ని మెప్పించిన ఇవి ఇప్పుడు ఈతరం అమ్మాయిల్ని మురిపించడానికి వచ్చేశాయి. అయితే, కాస్త పరిమాణం తగ్గి మువ్వల్లా మారి... జ్యూయెలరీలో చేరి సందడి చేస్తున్నాయి. కాసులపేరుతో జతకడుతున్నాయి. హారాల్లో ఒదిగిపోతున్నాయి.  ఈ పసిడి పూసలు... కుందన్లు, రాళ్లూ వంటివాటితో చేసిన పెండెంట్లకు తోడై... మెడలో వేసుకుంటే మెరిసిపోతున్నాయి. ధగధగలాడుతూ ధరించినవారికి లక్ష్మీకళను, నిండుదనాన్ని తెచ్చిపెడుతున్నాయి. మీరూ వీటినోసారి చూస్తే మనసు పారేసుకోకుండా ఉండలేరు మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్