పసుపు... కురులకీ!

చర్మానికి ఉపయోగించే సహజ చికిత్సలేవైనా వాటిల్లో కాస్తంత పసుపునకి చోటివ్వాల్సిందే కదూ! ఇన్ఫెక్షన్లను దూరం చేసి, మోము నిగారించేలా చేస్తుందని నమ్మకం.

Published : 23 May 2024 01:20 IST

చర్మానికి ఉపయోగించే సహజ చికిత్సలేవైనా వాటిల్లో కాస్తంత పసుపునకి చోటివ్వాల్సిందే కదూ! ఇన్ఫెక్షన్లను దూరం చేసి, మోము నిగారించేలా చేస్తుందని నమ్మకం. మరి కురులకూ అంతకుమించి మేలు చేస్తుందని తెలుసా?

మాస్క్‌... అరకప్పు పెరుగుకు అరస్పూను పసుపు, చెంచా తేనె కలిపి, మాడు నుంచి చివర్ల వరకూ పట్టించండి. అరగంటయ్యాక రసాయనాల్లేని షాంపూతో తలస్నానం చేస్తే సరి. ఈ మాస్క్‌ కురులను మృదువుగా ఉంచడమే కాదు మాడు ఆరోగ్యాన్నీ రక్షిస్తుంది.

స్క్రబ్‌... మృతకణాలను తొలగించుకోవడానికి ముఖానికి అడపాదడపా స్క్రబ్‌ చేస్తుంటాం కదా! మాడుకీ దీని అవసరం ఉంది. అక్కడా మృతకణాలు చేరి, కురుల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. కొన్నిసార్లు అలర్జీలకీ కారణమవుతాయి. వాటిని పోగొట్టాలంటే... దీన్ని ప్రయత్నించండి. పావుకప్పు పెరుగుకు స్పూను చొప్పున ఓట్‌మీల్‌ పౌడర్, పసుపు, శనగపిండి కలపాలి. పది నిమిషాలు పక్కనపెట్టి, తలకు పట్టించాలి. ఆపై వృత్తాకారంలో అయిదు నిమిషాలు మృదువుగా రుద్ది పావుగంట వదిలేయాలి. ఆపై తలస్నానం చేస్తే సరి. ఈ స్క్రబ్‌ మాడుకు రక్తప్రసరణ బాగా జరిగేలా చూడటమే కాదు... దాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతుంది. వారానికోసారి ప్రయత్నిస్తే సరి.

షాంపూ... స్క్రబ్, మాస్క్‌లు వేసేంత సమయం లేదంటారా? అయితే షాంపూతో తలస్నానం చేశాక గోరువెచ్చని నీటిలో పసుపు వేసి మరోసారి తలను కడిగితే చాలు. ఇది మాడుకు తాజాదనం కలిగిస్తూనే చుండ్రు, స్కాల్ప్‌ యాక్నేలనూ దూరం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్