జిగ్‌జాగ్‌ ప్రింట్‌ జోరు

ప్రాచీన కళలకే కాదు, ఫ్యాషన్లకూ ఇప్పుడు వైభవం వచ్చింది. ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అన్న నానుడిని నిజం చేస్తూ ఎన్నెన్నో ట్రెండ్స్‌ తిరిగొస్తున్నాయి. పాతవే కొత్తగా హంగులద్దుకుని, ఆధునికతను అందిపుచ్చుకుని ఫ్యాషన్‌ ప్రపంచంలో రాజ్యమేలుతుంటాయి.

Published : 25 May 2024 01:42 IST

ప్రాచీన కళలకే కాదు, ఫ్యాషన్లకూ ఇప్పుడు వైభవం వచ్చింది. ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అన్న నానుడిని నిజం చేస్తూ ఎన్నెన్నో ట్రెండ్స్‌ తిరిగొస్తున్నాయి. పాతవే కొత్తగా హంగులద్దుకుని, ఆధునికతను అందిపుచ్చుకుని ఫ్యాషన్‌ ప్రపంచంలో రాజ్యమేలుతుంటాయి. అలాంటివే ఈ చెవ్రాన్‌ ప్రింట్లు కూడా. ఈ పేరు లాటిన్‌ నుంచి వచ్చింది. ఈ డిజైన్‌ ఏమో గ్రీకులూ, రోమన్ల కాలం నాటిది. ఈ జామెట్రికల్‌ డిజైన్లు చూడ్డానికీ ఎంతో బాగుంటాయి. ఆంగ్ల ‘వి’ అక్షరం ఆకృతిని వరుస క్రమంలో కలిపినట్లు జిగ్‌జాగ్‌లా కనిపిస్తుంది. వస్త్రం, దుస్తుల డిజైన్‌ ఆధారంగా ఇందులోనూ మరెన్నో ప్యాటర్న్‌లు వచ్చేశాయి. ఆరంభంలో ఊలుతో అల్లిన స్వెటర్లలో ఈ డిజైను ఎక్కువగా కనిపించేదట. తరవాత కొన్ని దేశాల్లో మిలిటరీ దుస్తుల చేతులమీద కనిపించాయి. ఆ ప్రింట్లే ఇప్పుడు ట్రెండ్‌ అయ్యి ఫ్యాషన్‌ వేదికలపై తళుక్కుమంటున్నాయి. ఈతరం అమ్మాయిలను మెప్పిస్తున్నాయి. ఈ ప్రింటెడ్‌ డిజైన్‌తో చేసిన కఫ్తాన్‌లు, కుర్తీలు, గౌనులు, లెహెంగాలు మోడ్రన్‌ యువతులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. క్యాజువల్‌ వేర్‌కి అయినా వేడుకల్లో వేసుకోవాలనుకున్నా కూడా బాగుంటాయివి. మరింకెందుకాలస్యం ఈ ప్రింటు స్టైలుని ఎంచుకుని మీరూ మెరిసిసోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్