చుండ్రు తగ్గించే నువ్వుల నూనె!

వేసవిలో కాసేపు ఎండలోకి వెళ్లివస్తే ముఖమే కాదు... జుట్టూ పాడవుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నువ్వుల నూనెవాడి చూడండి. ఎన్ని ప్రయోజనాలో!

Published : 27 May 2024 01:44 IST

వేసవిలో కాసేపు ఎండలోకి వెళ్లివస్తే ముఖమే కాదు... జుట్టూ పాడవుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నువ్వుల నూనెవాడి చూడండి. ఎన్ని ప్రయోజనాలో!

యూవీ కిరణాల నుంచి నువ్వుల నూనె జుట్టుకి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం వంటివి మాడుని చల్లబరిచి ఒత్తిడిని తగ్గించడంలో సాయపడతాయి. పావుకప్పు నువ్వుల నూనె వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాడు నుంచి చివర్ల వరకూ పట్టించాలి. గంటాగి గాఢత తక్కువగల షాంపూతో తలస్నానం చేస్తే సరి.

మాడుమీద పుండ్లు, దురద, చుండ్రు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటే.. నువ్వులనూనె, వేప నూనెలను సమాన పరిమాణంలో  కలిపి తలకు రాసుకోవాలి.  కాసేపు మర్దనా చేసి  ఆపై రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేస్తే సరి. వీటిల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్