మొటిమల్ని తగ్గించే జామాకు..

పర్యావరణ కాలుష్యం, మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ముఖంపై గీతలు, నల్లమచ్చలు ఏర్పడుతున్నాయి. వీటిని దూరం చేయడంలో జామాకు బాగా పనిచేస్తుంది.

Published : 05 Jun 2024 03:03 IST

పర్యావరణ కాలుష్యం, మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ముఖంపై గీతలు, నల్లమచ్చలు ఏర్పడుతున్నాయి. వీటిని దూరం చేయడంలో జామాకు బాగా పనిచేస్తుంది.

  • జామాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మొటిమల్ని తగ్గించడంలో సాయపడతాయి. ఇందుకు గుప్పెడు జామాకుల్ని తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. రసం తీసి దానికి రెండు చెంచాల ఆవుపాలు కలిపి ముఖానికి పట్టించాలి. ఇది సెబమ్‌ ఉత్పత్తినే కాదు, మొటిమలతో వచ్చే వాపునీ తగ్గిస్తుంది.
  • గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చున్న వారిలో నీలికాంతి వల్ల ముఖంపై పిగ్మెంటేషన్‌ ఏర్పడుతుంది. నల్లగా మారుతుంది. ఆ నలుపు తగ్గాలంటే నాలుగు జామాకుల్ని ఒక గిన్నెనీటిలో వేసి మరిగించాలి. ఆ నీటితో ముఖాన్ని కడిగితే సరి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్