ఇది కూడా మ్యాచింగ్‌ కాలమే..!

‘వానావానా వల్లప్పా. వాకిట తిరుగు చెల్లప్పా’ అంటూ చినుకుల్లో తడుస్తూ.. చిన్నారులు తెగ సంబరపడిపోయే వర్షాకాలం  వచ్చేస్తోంది. ఈ సందడితోపాటు పిల్లల్లో ఉత్సాహం నింపడం కోసం రకరకాలుగా వస్తున్న రెయిన్‌కోట్స్‌ ఇవి. అవేంటో చూద్దాం. 

Published : 09 Jun 2024 04:27 IST

‘వానావానా వల్లప్పా. వాకిట తిరుగు చెల్లప్పా’ అంటూ చినుకుల్లో తడుస్తూ.. చిన్నారులు తెగ సంబరపడిపోయే వర్షాకాలం  వచ్చేస్తోంది. ఈ సందడితోపాటు పిల్లల్లో ఉత్సాహం నింపడం కోసం రకరకాలుగా వస్తున్న రెయిన్‌కోట్స్‌ ఇవి. అవేంటో చూద్దాం. 

ఒంటినంతా కప్పే మోడల్‌ మాత్రమే కాకుండా రెయిన్‌కోట్‌ ఇప్పుడు డైనోసార్, ఫైర్‌ఫైటర్‌ డిజైన్లలో సూట్, గౌను, బ్లేజర్, కాలర్‌ షర్ట్, పోంఖో, హుడెడ్‌ జాకెట్‌ అంటూ, సరికొత్త డిజైన్లలో చిన్నారులను ఆకర్షిస్తున్నాయి. సాధారణ దుస్తుల్లాగే అనిపిస్తూ, పిల్లలను వర్షపు చినుకుల్లో తడవకుండా రక్షిస్తాయి. లోపలి దుస్తులను పొడిగానూ ఉంచుతాయి. 

 

జత కడుతున్నాయి...

చెెక్స్, పూల డిజైన్లు పరచుకున్న రెయిన్‌కోట్‌కు మ్యాచింగ్‌గా గొడుగు, బూట్లు కూడా వస్తున్నాయిప్పుడు. చిన్నారుల మనసుకు నచ్చే కార్టూన్లు, జంతువుల బొమ్మల ప్రింట్స్‌తో రెయిన్‌కోట్, గొడుగు మరింత ఆకర్షణీయంగా ఉంటున్నాయి. అలాగే సాధారణ వర్షాకాలం బూట్లులాంటివి మాత్రమే కాకుండా, నచ్చిన బూట్లకు కవర్స్‌లా తొడుక్కునేలా సౌకర్యంగా జిప్స్‌తో ఉండే కవర్లూ... వస్తున్నాయి. దీంతో ఖరీదైన బూట్లు పాడవకుండా ఉంటాయి. అంతేకాదు, మోకాళ్లపై వరకు వచ్చేలా ప్లాస్టిక్‌ సాక్సులాంటివి మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. పలు డిజైన్ల ప్రింట్‌తో వస్తున్న ఇవి ప్యాంటును తడవనివ్వకుండా ఉంచగలవు. ఈ సౌకర్యాలన్నీ పిల్లలను వర్షాకాలంలోనూ సరదాగా గడిపేలా చేస్తాయి. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్