చిటికెలో!

అల్పాహారం అనగానే ఇడ్లీ, దోశ, వడ... లాంటివే గుర్తుకు వస్తాయి కదూ. అవే కాదండి తక్కువ సమయంలో చేసుకునే... ఎక్కువ పోషకాలనిచ్చేవెన్నో ఉన్నాయి. అవేంటో చూసేద్దామా...

Updated : 17 Sep 2021 01:14 IST

అల్పాహారం అనగానే ఇడ్లీ, దోశ, వడ... లాంటివే గుర్తుకు వస్తాయి కదూ. అవే కాదండి తక్కువ సమయంలో చేసుకునే... ఎక్కువ పోషకాలనిచ్చేవెన్నో ఉన్నాయి. అవేంటో చూసేద్దామా...

ఉదయంపూట టైమ్‌ ఎక్కువగా లేనివారు ఉడికించిన గుడ్డు, అవకాడో, బ్రెడ్‌ స్లైస్‌లను కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తీ, పోషణ రెండూ లభిస్తాయి. త్వరగా తయారుచేసుకోవచ్చు.

* జీడిపప్పు, కిస్‌మిస్‌, బాదం, చెర్రీస్‌ వేసిన పెరుగు కూడా పోషకాలను దండిగా అందిస్తుంది. దీన్ని తయారుచేసుకోవడం చిటికెలో పని.

* తాజా పాలకూరతో చేసిన ఆమ్లెట్‌ తీసుకుంటే ప్రొటీన్‌లు, విటమిన్లు, మిగతా ఆవశ్యక మూలకాలన్నీ అందుతాయి.

* చీజ్‌, డ్రైఫ్రూట్స్‌, తాజా పండ్ల ముక్కలను తీసుకున్నా మంచిదే. 

* పాలలో హోల్‌గ్రెయిన్‌ సెరెల్స్‌ వేసి తింటే వావ్‌ అంటారు. అవసరమైన పోషకాలూ అందుతాయి.

* కేవలం ద్రవాలు మాత్రమే తీసుకోవాలనుకుంటే తాజా పండ్ల రసాలనూ ప్రయత్నించొచ్చు. పండ్లు, పాలకూర, పెరుగు కలిపి జ్యూస్‌లా తీసుకోవచ్చు.

* అరటిపండు, ఓట్స్‌, ఎండుఫలాలు కలిపి తీసుకుంటే మరీ మంచిది. ఆకలి తీరడంతోపాటు పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఓట్స్‌లో పాలు పోసి, యాపిల్‌, అరటి పండు ముక్కలు వేసి కాస్తంత చీజ్‌ కలిపి కూడా తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్