అది ఆకలి కాదేమో!

భోజన వేళల్లో కాకుండా ఇంకెప్పుడైనా తినాలనిపిస్తే అది నిజమైన ఆకలో కాదో ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోమంటున్నారు ఆహార నిపుణులు. ఆకలి లేక పోయినా ఏదో ఒక భావోద్వేగానికి గురైనపుడూ చాలామంది తినడానికి ప్రాధాన్యం ఇస్తారట.

Published : 23 May 2022 01:56 IST

భోజన వేళల్లో కాకుండా ఇంకెప్పుడైనా తినాలనిపిస్తే అది నిజమైన ఆకలో కాదో ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోమంటున్నారు ఆహార నిపుణులు. ఆకలి లేక పోయినా ఏదో ఒక భావోద్వేగానికి గురైనపుడూ చాలామంది తినడానికి ప్రాధాన్యం ఇస్తారట. దీనివల్ల అదనపు క్యాలరీలు చేరి బరువు పెరుగుతారని హెచ్చరిస్తున్నారు. మరి మీ ఆకలి నిజమైనదా, భావోద్వేగాలదా... అని గుర్తించడం ఎలా అంటే...

ఫుడ్‌ డెయిరీ రాయడం దీనికో పరిష్కారం. స్వీట్లు, స్నాక్స్‌ తినాలనుకున్నపుడు మీకు నిజంగానే ఆకలి వేస్తోందా లేదా అని ప్రశ్నించుకుని ఒక్క నిమిషం ఆగి కాగితంమీద జవాబు రాసుకోండి. దీనివల్ల మీ భావోద్వేగాల్ని నియంత్రించుకోవడానికి సమయం దొరుకుతుంది. నిజంగా ఆకలి అనిపిస్తే తినండి. లేదంటే తినకుండా ఉండండి.  

కొంతమంది ఏవైనా వంటకాలు, మిఠాయిలు కనిపించగానే రుచి చూద్దాం, కొద్దిగా తిందాం అనుకుంటారా.. మొదలుపెట్టిన తర్వాత ఆ ప్యాక్‌ ఖాళీ చేసేంతవరకూ ఆగలేరు. అంతా తిన్న తర్వాత తమని తాము నిందించుకుంటారు. అలాంటివాళ్లు ఇంట్లో హెల్దీ స్నాక్స్‌ మాత్రమే ఉండేట్టు చూసుకోవడం మేలు. దానివల్ల కాస్త తిన్నా కూడా క్యాలరీలు పెరగవు.

బాగా అలసిపోయినపుడు ఏం చేయాలి... విశ్రాంతి తీసుకోవాలి. కానీ మనలో చాలామంది చేసే పని ఏదో ఒకటి తినడం. అలాగే ఆకలి కాకపోయినా బోర్‌ కొట్టినపుడు ఏదో ఒకటి తినడం అలవాటు. ఇలాంటివాళ్లు ఆ సమయంలో ఇంకో వ్యాపకమేదైనా పెట్టుకుంటే తినకుండా ఉండొచ్చు. స్నానం చేసి రావడం, ఫేస్‌మాస్క్‌ ప్రయత్నించడం, సంగీతం వినడం... ఇవి చేసి చూస్తే మీరు ఆహారం సంగతి మర్చిపోతారు. .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్