జిమ్‌కు వెళుతున్నారా...

వాకింగ్‌కు వదులైన దుస్తులైనా ఫరవాలేదు. జిమ్‌కు మాత్రం ప్రత్యేక దుస్తులను ఎంచుకోవాలి. అప్పుడే వ్యాయామాలను తేలిగ్గా పూర్తి చేయొచ్చు. ఆ సమయంలో అసౌకర్యంగానూ, ఇబ్బందిగానూ అనిపించదు. ఎటువంటి అవుట్‌ఫిట్స్‌ జిమ్‌కు సౌకర్యంగా ఉంటాయో చూద్దాం. జిమ్‌లో వ్యాయామాలు పలురకాలు. సాధారణంగా బరువులెత్తడం, రన్నింగ్‌తోపాటు స్ట్రెచింగ్‌ వంటివాటికి హైవెయిస్ట్‌ లెగ్గింగ్స్‌, ప్రింటెడ్‌ ప్యాంటులైతే సౌకర్యంగా ఉంటాయి.

Updated : 25 Jun 2022 06:11 IST

వాకింగ్‌కు వదులైన దుస్తులైనా ఫరవాలేదు. జిమ్‌కు మాత్రం ప్రత్యేక దుస్తులను ఎంచుకోవాలి. అప్పుడే వ్యాయామాలను తేలిగ్గా పూర్తి చేయొచ్చు. ఆ సమయంలో అసౌకర్యంగానూ, ఇబ్బందిగానూ అనిపించదు. ఎటువంటి అవుట్‌ఫిట్స్‌ జిమ్‌కు సౌకర్యంగా ఉంటాయో చూద్దాం.

జిమ్‌లో వ్యాయామాలు పలురకాలు. సాధారణంగా బరువులెత్తడం, రన్నింగ్‌తోపాటు స్ట్రెచింగ్‌ వంటివాటికి హైవెయిస్ట్‌ లెగ్గింగ్స్‌, ప్రింటెడ్‌ ప్యాంటులైతే సౌకర్యంగా ఉంటాయి. ఇవి మరీ బిగుతుగా లేదా వదులుగా కాకుండా తీసుకోవాలి. అలాగే పైలేట్స్‌కు స్ట్రెచ్‌ అయ్యేలా ఉండే లెగ్గింగ్స్‌ను ఎంచుకోవాలి. సైక్లింగ్‌కు ప్రత్యేకంగా వస్తున్న షార్ట్స్‌ ఇబ్బందిని కలిగించవు. బాక్సింగ్‌కైతే బాక్సర్‌ షార్ట్స్‌ ప్రత్యేకం. జాగర్స్‌ లేదా స్వెట్‌ప్యాంటు  వీటిపై వదులైన టీ షర్టు జిమ్‌తోపాటు, ఆరుబయట రన్నింగ్‌కూ సౌకర్యంగా ఉంటాయి. అలాగే యాంకిల్‌ లెంగ్త్‌ వర్కవుట్‌ టైట్స్‌ జిమ్‌కు ధరించడానికి వీలుగా ఉంటుంది. ఇది  సాగేది ఎంపిక చేసుకోవాలి. మెష్‌ లెగ్గింగ్స్‌ వర్కవుట్‌ పాంట్లు చెమటని దరిచేరనియ్యవు. స్లిమ్‌ఫిట్స్‌, ప్యాకెట్‌ సౌకర్యం ఉండే రకాలూ దొరుకుతున్నాయి. కెమో ప్రింట్‌ ఉన్నవి స్టైలిష్‌గానూ ఉంటాయి. వీటితోపాటు మార్కెట్‌లో లభ్యమవుతున్న స్పోర్ట్స్‌ బ్రాలెట్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కొంత వదులుగా ఉండేవి తీసుకోవాలి. అలా అయితేనే వ్యాయామాలు చేసేటప్పుడు సౌకర్యంగా ఉంటుంది. చెమట పీల్చేలా, మృదువుగా ఉండే వస్త్రంతో చేసినదాన్ని మాత్రమే ఎంచుకోవాలి. స్పోర్ట్స్‌ బ్రాపైన ధరించడానికి జాకెట్స్‌, క్రాప్‌టాప్‌లు కూడా దొరుకుతున్నాయి. దుస్తుల విషయంలోనే కాకుండా సాక్సు, షూల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటే వ్యాయామాలను తేలికగా ముగించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్