పాలిచ్చే అమ్మలూ... సోంపు తినండి!

వక్కపొడికి బదులుగా సోంపు తినడం కొందరికి అలవాటు. వక్క రక్తాన్ని విరుస్తుంది. సోంపులో అలాంటి హాని చేసే గుణాలేమీ లేవు. పైగా ఎన్నో విధాల మేలు చేస్తుంది. దీన్ని రోజూ కాస్త తింటే ఎన్ని ఉపయోగాలో చూడండి...

Updated : 03 Jul 2022 06:52 IST

వక్కపొడికి బదులుగా సోంపు తినడం కొందరికి అలవాటు. వక్క రక్తాన్ని విరుస్తుంది. సోంపులో అలాంటి హాని చేసే గుణాలేమీ లేవు. పైగా ఎన్నో విధాల మేలు చేస్తుంది. దీన్ని రోజూ కాస్త తింటే ఎన్ని ఉపయోగాలో చూడండి...

* సోంపు తినడం వల్ల ఈస్ట్రొజెన్‌ హార్మోన్‌ పని తీరు మెరుగై పాలు సమృద్ధిగా తయారవుతాయి. కనుక పాలిచ్చే తల్లులు రోజూ కాస్త సోంపు తినడం మంచిది.
* భోజనం చేయగానే చిటికెడు సోంపు నోట్లో వేసుకుంటే ఆహారం వేగంగా అరుగుతుంది. జీర్ణశక్తికి దోహదం చేసే వాము, పుదీనాల్లాంటిదే సోంపు కూడా. దీన్ని దోరగా వేయించి గ్రైండ్‌ చేసి తడి లేని, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే చాలా రోజులు తాజాగానే ఉంటుంది. ఆ పొడిని రోజూ ఒక చెంచా చొప్పున తేనెలో రంగరించి ఓ నెల రోజులు క్రమం తప్పక తింటే జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు, ఆకలి మందగించడం లాంటి సమస్యలు నయమైపోతాయి.
* రోజూ పావు చెంచా సోంపు తినడం వల్ల శ్వాస తాజాగా ఉంటుంది.
* ఇది రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
* గ్యాస్ట్రిక్‌ సమస్యను, ఉబ్బస వ్యాధిని తగ్గిస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులకు నివారిణిగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఎ-విటమిన్‌ కళ్లకు మేలు చేస్తుంది.
* అరుచి, భోజనం సహించకపోవడం లాంటి సమస్యలను నివారిస్తుంది. ఆకలిని పెంచుతుంది.
* స్త్రీలకు ఇష్టమైన సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. ఎలాగంటారా.. సోంపుతో రక్తం శుద్ధి అవుతుంది కనుక ముఖంలో మెరుపు, చర్మానికి నిగారింపు వస్తాయి. మృదువైన చర్మం అందానికి తొలి మెట్టు కదా!
* ఊబకాయాన్ని, నరాల అస్వస్థతను, హృద్రోగాలను, టైప్‌-2 డయాబెటిస్‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్‌ నివారిణిగానూ పని చేస్తుందని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది.
* బిర్యాని, ఫ్రైడ్‌ రైస్‌ మొదలైన వాటిల్లో దీన్ని చేర్చడం వల్ల అదనపు రుచి వస్తుంది.
* ఇందులో పీచు మాత్రమే కాదు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్‌, సి-విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున శరీరానికి బహువిధాల మేలు చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్