ఇవి తింటే ఒత్తిడి దూరం..

మానసిక ఒత్తిడి, ఆందోళన దూరం కావాలంటే ఆహారంలో జాగ్రత్తలు తీసుకొని ఉపశమనం పొందొచ్చు అంటున్నారు.. నిపుణులు.ఆందోళనగా ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం అలవాటవుతుంది. ఇది అధిక బరువుకు దారితీసి మరిన్ని

Published : 04 Jul 2022 00:52 IST

మానసిక ఒత్తిడి, ఆందోళన దూరం కావాలంటే ఆహారంలో జాగ్రత్తలు తీసుకొని ఉపశమనం పొందొచ్చు అంటున్నారు.. నిపుణులు.

ఆందోళనగా ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం అలవాటవుతుంది. ఇది అధిక బరువుకు దారితీసి మరిన్ని అనారోగ్యాలకు కారణమవుతుంది. అలాకాకుండా ఏదైనా తినాలనిపించినప్పడు తాజా పండ్లను తీసుకోవాలి. ఆహారంలో పోషకవిలువలు ఉన్నవాటిని ఎంచుకుంటే ఆరోగ్యంతోపాటు ఒత్తిడీ దూరమవుతుంది. గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, తాజా ఆకుకూరలు, జీడిపప్పు వంటివాటిలో ఉండే మెగ్నీషియం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీలు, నారింజ, జామ పండ్లు మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిటర్లను సమన్వయం చేసి ఒత్తిడి తగ్గిస్తాయి. గుడ్లు, చేప, చికెన్‌, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, చిక్కుడు గింజలు వంటివి మెదడును చురుగ్గా ఉంచుతాయి. సెరొటోనిన్‌ స్థాయులను పెంచి ఆందోళనకు కారణమయ్యే కార్టిసోల్‌ హార్మోన్‌ను తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్