వ్యాయామానికి బ్రేక్‌ పడిందా!

మబ్బుగా ఉందని బయటకు వెళ్లడం ఆగిపోతామా.. ఎండెక్కుతుంది. తుంపర్లే కదాని వాకింగ్‌కి వెళ్తామా పెద్ద జల్లు కురుస్తుంది. ఒకట్రెండు సార్లు ఇలా అనుభవమయ్యాక వ్యాయామం ఆలోచనే అటకెక్కిపోతుంది. అలాంటప్పుడు వీటిని ప్రయత్నించండి.

Updated : 11 Jul 2022 08:43 IST

మబ్బుగా ఉందని బయటకు వెళ్లడం ఆగిపోతామా.. ఎండెక్కుతుంది. తుంపర్లే కదాని వాకింగ్‌కి వెళ్తామా పెద్ద జల్లు కురుస్తుంది. ఒకట్రెండు సార్లు ఇలా అనుభవమయ్యాక వ్యాయామం ఆలోచనే అటకెక్కిపోతుంది. అలాంటప్పుడు వీటిని ప్రయత్నించండి.

* ఉదయం లేదా సాయంత్రం వీలునిబట్టి మాప్‌ పట్టుకుని ఇంటిని శుభ్రం చేయండి. సింక్‌లు, బాత్రూమ్‌.. వీటిని శుభ్రం చేసినా క్యాలరీలు బాగా ఖర్చవుతాయి. 

* సరకులు కొనడానికి వెళ్లే సమయాన్నీ వ్యాయామానికి ఉపయోగించుకోండి. కారు, బైక్‌ని దుకాణానికి కాస్త దూరంగా ఆపి అక్కణ్నుంచి నడిచి వెళ్లండి. ట్రాలీకి బదులు సంచిలో వస్తువులు వేసుకుని పట్టుకోండి. ఇలా చేస్తే భుజాలూ, మోచేతులకు వ్యాయామం అయినట్లే.

* వారాంతాల్లో అయితే కారు లేదా బైక్‌ని కడిగే పని పెట్టుకోండి.

* తోటపని అలవాటుందా? లేకపోతే అలవాటు చేసుకోవడానికి ఇదే అనుకూలమైన సమయం. మట్టిని తవ్వడం, కుండీలు ఎత్తడం.. ఇవీ వ్యాయామంతో సమానమే.   

* ఇంట్లో ఉతకాల్సిన బట్టలేమైనా ఉన్నాయోమే చూడండి. ఉతకడం, జాడించడం, ఆరేయడం, మడతబెట్టడం.. ఇవన్నీ చేసేటప్పుడు వంగుతాం, బరువులెత్తుతాం.. దీంతో ఒకేసారి భిన్నమైన కండరాలు పనిచేస్తాయి.

* పిల్లలతో సమయం గడిపినా వ్యాయామమే. వాళ్లు పరిగెత్తితే పట్టుకోవడం, దాగుడుమూతలు ఆడటం, ఊయల్లో పెట్టి ఊపడం... ఇవన్నీ గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి.

* నిటారుగా కూర్చోవడమూ ఆరోగ్యానికి మేలుచేస్తుందని తెలుసా? పనిలో, డ్రైవింగ్‌లో, డైనింగ్‌ టేబుల్‌ దగ్గర... వెన్నువంగకుండా కూర్చోవడానికి ప్రయత్నించండి. ఇదికూడా శరీర దృఢత్వాన్ని పెంచుతుంది.

* ఇవన్నీ చేస్తూనే నీళ్లు తాగడం మర్చిపోవద్దు. గుండె రక్తాన్ని పంపు చేయడంలో నీటిది కీలక పాత్ర.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్