వర్షాకాలంలో వెజీనా ఇన్ఫెక్షన్‌...

చినుకులు పడుతున్నాయంటే ఆహ్లాదంగా అనిపిస్తుంది. అదే సమయంలో పలురకాల అనారోగ్యాలు కూడా పలకరించే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా ఈ సీజన్‌లో వెజీనాకు ఇన్ఫెక్షన్‌ సోకే ముప్పు ఉందంటున్నారు వైద్యులు. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలూ చెబుతున్నారు...

Updated : 14 Jul 2022 08:55 IST

చినుకులు పడుతున్నాయంటే ఆహ్లాదంగా అనిపిస్తుంది. అదే సమయంలో పలురకాల అనారోగ్యాలు కూడా పలకరించే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా ఈ సీజన్‌లో వెజీనాకు ఇన్ఫెక్షన్‌ సోకే ముప్పు ఉందంటున్నారు వైద్యులు. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలూ చెబుతున్నారు...

వాతావరణం నిత్యం అతి చల్లగా, చెమ్మగా ఉండటంవల్ల సూక్ష్మజీవులు త్వరగా వృద్ధి చెందుతాయి. ఈ సమయంలో పరిశుభ్రతను పాటించకపోతే వెజీనా ఇన్ఫెక్షన్‌కు గురవుతుంది. దీంతో అలర్జీ, దురద, డిశ్చార్జి వంటి సమస్యలే కాకుండా సంతాన సాఫల్యానికి అవరోధంగానూ మారే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. లేదంటే సూక్ష్మజీవులు ఆరోగ్యంపై దాడి చేసే ముప్పుంది. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వాతావరణం లేదా నీటి నుంచి సూక్ష్మజీవులు వెజీనా లోపలి గోడలకు చేరి ఇన్‌ఫెక్షన్‌ సోకడానికి కారణమవుతాయి. ఇది అలర్జీగా మారి, వైట్‌ డిశ్చార్జి మొదలవుతుంది. దురద, మంట వంటివి బాధిస్తాయి. ఇటువంటప్పుడు వైద్యులను సంప్రదించాలి. 

జాగ్రత్తలు..

ఈ విషయంలో అప్రమత్తత మేలు. లోదుస్తుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి. సింథటిక్‌ కాకుండా మృదువైన కాటన్‌ వస్త్రంతో తయారయ్యే వాటినే వినియోగించాలి. బిగుతుగా కాకుండా కాస్తంత వదులుగా ఉన్నవైతే గాలి ప్రసరణకు వీలుంటుంది. తడిగా ఉన్న వాటిని కాకుండా పొడి లోదుస్తులనే ధరించాలి. అనుకోకుండా తడిసినప్పుడు, అశ్రద్ధ చేయకుండా వెంటనే వాటిని మార్చుకోవాలి. మూత్రవిసర్జన చేసిన ప్రతిసారీ వెజీనాను శుభ్రపరుచుకోవాలి. నెలసరిలో రోజులో కనీసం మూడు నాలుగు సార్లు ప్యాడ్‌ను మార్చుకోవాలి. ఇలా చేసినప్పుడల్లా వెజీనాను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం మరవకూడదు. ఎంత శుభ్రతను పాటిస్తే, అంత ఆరోగ్యం. దీంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషకవిలువలున్న ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. శరీరానికి సి విటమిన్‌ ఎక్కువగా అందేలా చూసుకోవాలి. ప్రొబయాటిక్స్‌ ఉండే పెరుగు వంటివి ఆహారంలో తప్పనిసరి. రిఫైన్డ్‌ కార్బొహైడ్రేట్స్‌కు దూరంగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్