వ్యాయామం గర్భిణికెంతో ప్రయోజనం...

గర్భం దాల్చినప్పటి నుంచి రోజూ నిర్ణీత సమయంలో చేసే వ్యాయామాలు ప్రసవ సమయంలోనే కాకుండా, ఆ తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు వైద్యులు. వీటివల్ల మరెన్నో ప్రయోజనాలున్నాయని పలు అధ్యయనాలూ తేల్చి చెప్పాయి.

Updated : 15 Jul 2022 06:05 IST

గర్భం దాల్చినప్పటి నుంచి రోజూ నిర్ణీత సమయంలో చేసే వ్యాయామాలు ప్రసవ సమయంలోనే కాకుండా, ఆ తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు వైద్యులు. వీటివల్ల మరెన్నో ప్రయోజనాలున్నాయని పలు అధ్యయనాలూ తేల్చి చెప్పాయి.

వ్యాయామాలు గర్భిణి తేలికగా ప్రసవించేలా శరీరాన్ని మారుస్తాయి. కండరాల కదలికలు తేలికగా జరిగేలా చేస్తాయి. నెలలు పెరుగుతున్న కొద్దీ బిడ్డ బరువు తల్లి వెన్నుపై పడుతుంది. ఇది కాబోయే తల్లులకు నడుం నొప్పికి దారి తీస్తుంది. గర్భం దాల్చినప్పటి నుంచి విశ్రాంతిగా కూర్చోడం మంచిదే. అయితే రోజంతా ఒకేచోట కూర్చోకుండా మధ్య మధ్య కాసేపు అటూఇటూ తిరుగుతూ ఉండాలి. రోజూ నిపుణుల సూచనలకు అనుగుణంగా కనీసం 20 నుంచి 30 నిమిషాలు తేలికైన, చిన్నచిన్న వ్యాయామాలు చేయడం, మధ్యాహ్నం, రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత పది నిమిషాలు నెమ్మదిగా అడుగులేయడంతో శరీర కండరాలు బలోపేతమవుతాయి.

మరిన్ని..

వెన్నెముకలో అలసట అనిపించదు. దీంతో నడుం, కాళ్ల నొప్పి వంటి అసౌకర్యాలు కలగవు. వ్యాయామం శరీరాన్ని శక్తివంతంగా మారుస్తుంది. మానసికపరమైన ప్రయోజనాలు కూడా ఇందులో ఎన్నో ఉన్నాయి. మెదడు ఉత్సాహంగా ఉంటుంది. కంటినిండా నిద్రపడుతుంది. దీంతో నిద్రలేమి సమస్య వల్ల కలిగే అనారోగ్యాలు దరిచేరవు. అధికబరువు సమస్య ఎదురుకాదు. గర్భం దాల్చినప్పుడు తాత్కాలికంగా వచ్చే మధుమేహం నుంచి తప్పించుకోవచ్చు. కండరాల కదలికలో ఇబ్బంది తక్కువ ఉండటంతో సిజేరియన్‌ అవసరం లేకుండా తేలికగా ప్రసవించొచ్చు.

ప్రసవానంతరం..

ప్రసవించిన తర్వాత వైద్యుల సలహాతో నిర్ణీతకాలం తర్వాత తిరిగి వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి. దీనివల్ల ప్రసవానంతరం వచ్చే అధికబరువు, శరీరంలో వచ్చే పలురకాల మార్పులను దరిచేరకుండా చేయొచ్చు. నిద్రలేమి ఉండదు. ప్రసవానంతరం సాధారణంగా వచ్చే మానసిక ఆందోళన, ఒత్తిడి వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న వ్యాయామం చేయడానికి బద్ధకించకూడదు. కొన్ని ఆసుపత్రులు ప్రసవం తర్వాత తిరిగి వ్యాయామాలు చేసేలా తల్లులకు శిక్షణ నందిస్తున్నాయి. నిపుణుల సూచనలతో తిరిగి వ్యాయామాలను కొనసాగించి, సంతోషంగా, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్