సౌందర్య సాధనం గుమ్మడి

వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ అన్న ఆట ఆడని వారు... గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నారట అనే సామెత వాడని వారూ తెలుగునాట ఉండరు. మరి మనం ఇంతగా తలుచుకునే గుమ్మడి ఆరోగ్యానికి మహా మంచిది తెలుసా? సంపెంగ రంగులో అందంగా ఉండే గుమ్మడి కాయలో ఏమేం లాభాలున్నాయంటే...

Published : 16 Jul 2022 00:18 IST

వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ అన్న ఆట ఆడని వారు... గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నారట అనే సామెత వాడని వారూ తెలుగునాట ఉండరు. మరి మనం ఇంతగా తలుచుకునే గుమ్మడి ఆరోగ్యానికి మహా మంచిది తెలుసా? సంపెంగ రంగులో అందంగా ఉండే గుమ్మడి కాయలో ఏమేం లాభాలున్నాయంటే...

ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్‌, మెగ్నీషియం, సోడియం, పీచు పుష్కలంగా ఉన్నందున మంచి పోషకాహారం.

గుమ్మడి శరీరానికి శక్తినివ్వడమే గాక రక్తంలో చేరిన మలినాలను బయటకు పంపుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పరుస్తాయి. ఇది రక్తప్రసరణ సాఫీగా ఉండేలా చేస్తుంది. బీపీని నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ని హరిస్తుంది. హృద్రోగాలను అరికడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

గుమ్మడి తినడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. మలబద్ధకం నుంచి బయట పడొచ్చు. ఇందులోని ఎ-విటమిన్‌ కళ్లకెంతో మంచిది.

శరీర బరువు తగ్గించుకోవడానికి నానా యాతనా పడినా ఫలితం మాత్రం లేదంటూ కొందరు మహిళలు బాధపడుతుంటారు. అలాంటివారు ఆహారంలో గుమ్మడి ఉండేలా చూసుకోండి. అది బరువు తగ్గకుండా, పెరగకుండా సమంగా ఉండేలా చేస్తుంది.

మధుమేహంతో యాతన పడుతున్న వారికి గుమ్మడి ఔషధంలా పని చేస్తుంది.

వ్యాయామం చేసిన తర్వాత కొన్ని గుమ్మడి గింజలు తినడం వల్ల అలసట తీరుతుంది. ప్రమాదవశాత్తూ గాయపడిన లేదా అనారోగ్య కారణంతో బలహీనంగా అయినవారు గుమ్మడి గింజలు తినడం వల్ల త్వరగా కోలుకోవచ్చు. ఈ గింజలు రోజూ కొన్ని తినడం ఆరోగ్య లక్షణం. శరీరంలో అన్ని భాగాలకూ విటమిన్లూ, ప్రొటీన్లూ అందుతాయి.

అన్నిటినీ మించి స్త్రీలకు సౌందర్య పోషణకు ఉపయోగపడుతుంది. ఏదో రూపంలో గుమ్మడిని ఆహారంగా తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడదు. కాంతి వచ్చి చేరుతుంది. గుమ్మడి గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా ఉపయోగించడం వల్ల ముఖానికి మెరుపు, నునుపూ వస్తాయి. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్