తోటపని దివ్యౌషధం...

తోటపని మానసికారోగ్యాన్ని పెంపొందిస్తుందని ఓ అధ్యయనం తేల్చింది. మొక్కల పెంపకమే అలవాటు లేని వారిని ఎంపిక చేసిమరీ చేపట్టారీ పరిశోధన. దీని వల్ల వీరంతా ఒత్తిడికి దూరమైనట్లు గుర్తించారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో

Published : 17 Jul 2022 02:27 IST

తోటపని మానసికారోగ్యాన్ని పెంపొందిస్తుందని ఓ అధ్యయనం తేల్చింది. మొక్కల పెంపకమే అలవాటు లేని వారిని ఎంపిక చేసిమరీ చేపట్టారీ పరిశోధన. దీని వల్ల వీరంతా ఒత్తిడికి దూరమైనట్లు గుర్తించారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనంలో ఏం తేలిందంటే... 

తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నవారు, పలు రకాల సవాళ్లను ఎదుర్కొన్న వారిపై చేసిన ఈ అధ్యయనంలో తోటపనితో వారిలో ఆందోళన, ఒత్తిడి దూరమయ్యాయని గుర్తించారు. ఈ సారి తోటపనివైపు అసలు కన్నెత్తని 26- 49 వయోవర్గం నుంచి కొందరిని ఎంపిక చేశారు. వీరంతా పొగాకు, మత్తుపదార్థాల వినియోగం, ఆందోళన, ఒత్తిడి వంటి వాటికి చికిత్సలు పొందుతున్నారు. మానసికపరమైన చికిత్సలు అందుకుంటున్న వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపును తోటపని నేర్చుకోవడానికి, మిగతా వారిని ఆర్ట్‌లో శిక్షణకు కేటాయించారు. ఈ శిక్షణా తరగతుల్లో వీరందరినీ కొత్త ఆలోచనలను చెప్పడం, సృజనాత్మకతను ప్రదర్శించడం నుంచి ప్రణాళికాబద్ధంగా పని చేసేలా ప్రోత్సహించారు. వారానికి రెండుసార్లుగా, నాలుగు వారాల పాటు ఈ మహిళలందరూ తరగతులకు హాజరయ్యారు. వీరి ప్రవర్తనను కూలంకషంగా పరిశీలించడమే కాకుండా వైద్య పరీక్షల ఆధారంగా కూడా వీరి మానసికస్థితిని అంచనా వేశారు.

తగ్గింది...

తోటపనిలో ఉన్నవారు ఆయా మొక్క బట్టి పెంచే విధానం, విత్తనాలు నాటడం, రెండు రకాల మొక్కలను అంటుకట్టడం, తినదగ్గ మొక్కలను రుచి చూడటం వంటివాటిలో ఉత్సాహంగా కనిపించారు. ఆసక్తి ఉన్న మహిళలు పేపర్‌, ప్రింట్‌ మేకింగ్‌, చిత్రలేఖనం వంటి కళల్లో నైపుణ్యాలను నేర్చుకున్నారు. శిక్షణ ముగిసిన తర్వాత వీరందరిలో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, మానసిక స్థితిని పరిశీలించగా, ఇందులో కళలను సాధన చేసిన వారి కన్నా తోట పని చేసిన వారిలో ఒత్తిడి, ఆందోళన వంటివి బాగా తగ్గినట్లు గుర్తించారు. తోటపనిలో మానసికారోగ్యం పెంపొందుతుందని, దీన్నే ‘థెరప్యూటిక్‌ హార్టికల్చర్‌’గా 19వ శతాబ్దం నుంచి పిలుస్తున్నారని అధ్యయనవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నవారంతా ఇకపై తాము తోటపెంపకాన్ని ప్రారంభించనున్నామని, దీన్నే తమ మనసుకు చికిత్సగా భావిస్తామని చెప్పడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్