అయితే.. ఇంట్లో చేయండి!

వాతావరణం హాయిగా మారిపోయింది కదూ! ఇంట్లో వాళ్లకి వేడివేడిగా స్నాక్స్‌, టీ చేసిస్తూ ఉండుంటారు. మరి వ్యాయామం సంగతో? వాన కదా.. బయటకు వెళ్లడం ఇబ్బంది అంటారా! అయితే వీటిని ప్రయత్నించేయండి.

Published : 21 Jul 2022 01:31 IST

వాతావరణం హాయిగా మారిపోయింది కదూ! ఇంట్లో వాళ్లకి వేడివేడిగా స్నాక్స్‌, టీ చేసిస్తూ ఉండుంటారు. మరి వ్యాయామం సంగతో? వాన కదా.. బయటకు వెళ్లడం ఇబ్బంది అంటారా! అయితే వీటిని ప్రయత్నించేయండి.

స్పాట్‌ జాగింగ్‌.. జాగింగ్‌ తెలుసు కదా! దాన్ని ఒకే ప్రదేశంలో నిల్చొని చేయడమన్న మాట. కాళ్లతోపాటు చేతులనీ కదపాలి. దీన్ని అరగంట చేస్తే 215 కేలరీలు కరుగుతాయట.

తాడాట.. ఎముకలకే కాదు.. గుండె ఆరోగ్యానికీ ఇది మేలంటారు నిపుణులు. పిరుదులు, నడుము దగ్గర పేరుకున్న కొవ్వునీ కరిగించేస్తుంది. 30 నిమిషాలు చేస్తే 280 కేలరీలు దూరం చేసుకోవచ్చు.

స్ట్రెంత్‌ ట్రైనింగ్‌.. రెండు లీటర్‌ వాటర్‌ బాటిళ్లను నీటితో నింపేయండి. రెండు చేతుల్లో వాటిని పైకి ఎత్తి ఉంచండి. కుర్చీలో కూర్చున్నట్లుగా ఉండి రెండు చేతులతో రెండు బాటిళ్లను కాళ్లపై పెట్టకుండా 30 సెకన్ల పాటు ఉండండి. ఇవీ ఎముకల్ని దృఢపరిచేవే! రోజు మొత్తంలో ఎప్పుడు వీలు కుదిరినా చేస్తుంటే 200 కేలరీల వరకూ ఖర్చు అవుతాయట.

ప్లాంక్‌.. బోర్లా పడుకోవాలి. మోచేతులు, అరి కాళ్లను ఆధారంగా చేసుకొని శరీరం మొత్తాన్నీ పైకి లేపి ఉంచాలి. 30 సెకన్లు అలా ఉండటానికి ప్రయత్నించాలి. ఓ పది సెట్లు చేయాలి! రోజులు గడిచేకొద్దీ సమయాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళితే సరి. 100 కేలరీలు కరుగుతాయి. అదనంగా పొట్ట వద్ద కొవ్వు కరుగుతుంది. వెన్నెముక గట్టి పడుతుంది.

యోగా.. దీంతో శరీరంతోపాటు మానసిక ఆరోగ్యం అదనం. శరీరమూ ఫ్లెక్సిబుల్‌గా తయారవుతుంది. పైగా ఇంట్లోనే చేయొచ్చు. ప్రాణాయామం, సూర్య నమస్కారాలను ప్రయత్నించండి. ఆరోగ్యం, రోజంతా ఉల్లాసం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్