చిలుకాసనంతో పొట్ట తగ్గిపోతుంది...

ఆహారం, అలవాట్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. మనలో కొందరికి పొట్ట రావడం, నడుం దగ్గర వంపు తగ్గి మందంగా మారటం తెలిసిందే. వీటివల్ల అందానికి కోత పడుతుంది. వ్యాయామాలు చేసినా ఈ విషయాల్లో మార్పు రావడం లేదని బాధపడే

Updated : 15 Aug 2022 15:28 IST

ఆహారం, అలవాట్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. మనలో కొందరికి పొట్ట రావడం, నడుం దగ్గర వంపు తగ్గి మందంగా మారటం తెలిసిందే. వీటివల్ల అందానికి కోత పడుతుంది. వ్యాయామాలు చేసినా ఈ విషయాల్లో మార్పు రావడం లేదని బాధపడే వాళ్లెందరో. ఇంతకు మునుపు చెప్పుకొన్న పరివృత్త జాను శీర్షాసనంతో శరీరంలో పేరుకున్న కొవ్వు తగ్గి మీరు ఆశించే మార్పు  సాధ్యమవుతుంది. ఆ ఆసనం కష్టంగా అనిపిస్తే చిలుకాసనం ప్రయత్నించండి. ఇది కూడా మేలైన ఆసనం. పొట్టలోని అవయవాలన్నింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక కొవ్వు తగ్గి సన్నటి నడుంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు.

ఇలా చేయాలి... ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. చిలుక ఎలా ఉంటుందో ఆ భంగిమలో ఉంటుందీ ఆసనం. రెండు కాళ్లూ వెనుకకు మడిచి పెట్టుకోవాలి. కుడికాలును వీలైనంత వెనక్కి పెట్టి ఎడమ పిరుదు మీద కూర్చోవాలి. కుడికాలును మెల్లగా వెనక్కి జాపి మోకాళ్ల దగ్గర మడిచి, కుడికాలి మడమను కుడిచేయి మోచేతి దగ్గరకు తీసుకొచ్చి పైన ఉంచాలి. ఎడమ చేతిని తల మీది నుంచి కుడివైపునకు తెచ్చి రెండు చేతులూ తాకేలా ఉంచాలి. ఎవరికైనా రెండు చేతులూ తాకకపోయినా ఫరవాలేదు. రెండో చేతిని తల మీది నుంచి కాకుండా ముందు వైపు నుంచి రానిచ్చి రెండు చేతులతో పాదాలను పట్టుకోవచ్చు. ఈ స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. మెల్లగా చేతులు వదులుతూ కాళ్లను రిలాక్స్‌ చేయాలి. తర్వాత మెల్లగా వజ్రాసనంలోకి వచ్చేయాలి. మళ్లీ ఇదే విధంగా ఎడమ కాలిని వెనక్కి పెట్టి కుడి పిరుదు మీద కూర్చోవాలి. ఎడమ మోచేతి దగ్గర ఎడమ కాలి మడమను ఉంచి కుడిచేతిని తల మీదుగా తెచ్చి రెండు చేతులూ కలిపి ఉంచాలి. ఇలా రెండుసార్లు చేయాలి. దీంతో జననావయవాలూ ఉత్తేజితం అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్