ఆందోళనా.. అయితే పరిగెత్తండి!

‘ఊరికే కంగారు పడతావు’ అని సరదాకే అన్నా.. మనకు ప్రతి విషయంలో ఇది సాధారణమే! పిల్లలు తినకపోయినా, సమయానికి ఇంటికి చేరుకోకపోయినా, ఇంట్లో ఎవరిదైనా ఆరోగ్యం పాడైనా.. చెప్పుకుంటూ పోతే ఆందోళన, కంగారు కలిగించే జాబితా బోలెడు.

Published : 25 Jul 2022 00:34 IST

‘ఊరికే కంగారు పడతావు’ అని సరదాకే అన్నా.. మనకు ప్రతి విషయంలో ఇది సాధారణమే! పిల్లలు తినకపోయినా, సమయానికి ఇంటికి చేరుకోకపోయినా, ఇంట్లో ఎవరిదైనా ఆరోగ్యం పాడైనా.. చెప్పుకుంటూ పోతే ఆందోళన, కంగారు కలిగించే జాబితా బోలెడు. ఇవన్నీ మన ఆరోగ్యంపైనే దుష్ప్రభావాల్ని చూపుతాయి. తగ్గాలంటే.. వీటిని పాటిస్తుండండి.

* సంగీతం.. మనసును శాంత పరిచే సాధనం. కంగారుగా అనిపిస్తే మంద్రంగా ఉండే వాయిద్య సంగీతాన్ని వినండి. గుండె వేగం తగ్గడాన్ని మీరే గమనిస్తారు. ఒత్తిడి కలిగించే హార్మోను విడుదలను తగ్గించడంలో ఇది దివ్యౌషధం.

* 4-7-8... అనుకూలమైన స్థలాన్ని ఎంచుకొని నిటారుగా కూర్చోండి. పళ్ల మధ్యలో నాలుకను మడిచి నోటి నుంచి గాలిని పీల్చి వదిలేయండి. తర్వాత ముక్కు ద్వారా 4 సెకన్లపాటు శ్వాస తీసుకొని 7 లెక్కపెట్టేంత వరకూ బంధించి వదిలేయాలి. మొదట చేసిన విధంగా నోటితో గాలిని 8 సెకన్లు బంధించి వదిలేయాలి. ఇలా మూడుసార్లు చేసి చూడండి. ఉపశమనం లభిస్తుంది. నిద్ర పట్టకపోయినా ఈ పద్ధతి ప్రయత్నించొచ్చు.

* వ్యాయామం.. ప్రతికూల ఆలోచనలు, ఆందోళనను తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆలోచనలు చుట్టు ముడుతోంటే వ్యాయామాన్ని ఆశ్రయించేయండి. నిల్చొనే జాగింగ్‌, గెంతడం, ప్లాంక్‌.. ఇలా ఏవైనా సరే ఆపకుండా కనీసం 15 నిమిషాలు చేయాలి. అప్పుడు కంగారు తగ్గి స్పష్టంగా ఆలోచించేలా మెదడూ సిద్ధమవుతుంది.

* వాటిని చూస్తే సరి.. కాస్త పచ్చదనం, నీరు ఉన్న చోటికి వెళ్లండి. ప్రకృతి, ఆకుపచ్చ, నీలం రంగులు మనసుకి ప్రశాంతతనిస్తాయి. మొక్కల మధ్య నడక, లేదా ఆ రంగులను కాసేపు తదేకంగా చూసినా మంచిదే.

* జాబితా.. అక్షరాలను పేపర్‌పై ఉంచండి. ఏ విషయాలు కంగారు పెడుతున్నాయి? ఏ సమయంలో గుండె వేగం పెరుగుతోంది.. లాంటివి ఆలోచించి రాసేయండి. ఓసారి గమనించుకుంటే వాటిపై స్పష్టత వస్తుంది కదా! ఉదాహరణకు ఉదయం మీకు బాగా కంగారుగా ఉంటుందనుకోండి. అలారం పెట్టుకొని మనసులో ‘ఆందోళనకు ఇది సమయం కాదు..’ అని చెప్పుకుంటూ ఉండండి... లేదూ కాస్త భిన్నమైన పనిని చేసుకుంటూ వెళ్లండి. ఆందోళన అల్లంత దూరానికి వెళ్లిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్