ఇవి అమ్మ కోసం...

ప్రసవమైన వెంటనే తల్లికి తన చిన్నారి పాలనే అతి ముఖ్యంగా కనిపిస్తుంది. అయితే పాపాయి సంరక్షణతోపాటు తన ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకుంటేనే ఇరువురూ సంతోషంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటేనే తల్లిపాల ఉత్పత్తి బాగుంటుందని సూచిస్తున్నారు.

Published : 27 Jul 2022 00:24 IST

ప్రసవమైన వెంటనే తల్లికి తన చిన్నారి పాలనే అతి ముఖ్యంగా కనిపిస్తుంది. అయితే పాపాయి సంరక్షణతోపాటు తన ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకుంటేనే ఇరువురూ సంతోషంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటేనే తల్లిపాల ఉత్పత్తి బాగుంటుందని సూచిస్తున్నారు.

ల్లైన తర్వాత డైటింగ్‌, కేలరీలు పెరుగుతాయనే ఆలోచన పక్కన పెట్టాలంటున్నారు నిపుణులు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ, పోషకాహారాన్ని తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. గింజధాన్యాలు, ప్రొటీన్లుండే మాంసాహారం, తాజా కూరగాయలు, ముదురువర్ణం పండ్లు వంటివి ప్రతిరోజు ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. చిక్కుడుజాతి కూరగాయలు, ఆకుకూరలు శరీరానికి కావాల్సిన విటమిన్లను అందిస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.

పాలిచ్చేటప్పుడు..

చిన్నారి సంరక్షణలో పడి తమ గురించి ఆలోచించే సమయం ఉండకపోవడం, రాత్రుళ్లు నిద్ర తక్కువకావడం వంటివన్నీ తల్లి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. చిన్నారికి సరిపోయినన్ని పాలు ఉత్పత్తికాకపోవచ్చు. అలాగే పాలిచ్చే సమయంలో ఎక్కువగా దాహం వేస్తుంటుంది. ఇటువంటప్పుడు పండ్లరసాలు, మంచినీళ్లు, పాలు వంటివి తరచూ తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా ఉంటుంది. మధ్యమధ్యలో విరామం ఇస్తూ రోజులో కనీసం అయిదారుసార్లు తల్లి మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. భోజనంతోపాటు పండ్లు, మధ్యలో స్నాక్స్‌ వంటివి మేలు. పాలిచ్చే తల్లికి రోజుకి రెండువేల కాలరీలు అవసరంకాగా, విటమిన్లు, ప్రొటీన్లతోసహా ఖనిజ లవణాలు పుష్కలంగా శరీరానికి అందేలా జాగ్రత్తపడితేనే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. తద్వారా పాపాయి ఎదుగుదల కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

పాపాయి కోసం..

మసాలా ఎక్కువగా లేని ఆహారాన్ని ఎంచుకోవాలి. లేదంటే పాపాయికి వీటివల్ల అలర్జీలు, అజీర్తి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టీ, కాఫీ, శీతలపానీయాలు వంటివాటికి తల్లి దూరంగా ఉండాలి. వీటి కారణంగా తల్లికి నిద్ర దూరమవుతుంది. ఇది పాపాయిపైనా చెడు ప్రభావం చూపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్