వెన్నెముక దారుఢ్యం కోసం...

ఎక్కువసేపు కూర్చునే లేదా నిలబడే వారికి వెన్నునొప్పి రావడం సాధారణం. దాన్ని నివారించి, వెన్నెముకకు బలం చేకూర్చుకోవాలనుకుంటే ‘స్పైన్‌ స్ట్రెంతెనింగ్‌ యోగా’ మంచిది. రోజూ సాధన చేస్తే వెన్ను బలపడుతుంది. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు బ్యాక్‌ పెయిన్‌ వచ్చినా, నడుం స్టిఫ్‌గా ఉన్నా కాసేపు వీటిని చేస్తే తక్షణ ప్రయోజనం ఉంటుంది.

Published : 30 Jul 2022 00:42 IST

ఎక్కువసేపు కూర్చునే లేదా నిలబడే వారికి వెన్నునొప్పి రావడం సాధారణం. దాన్ని నివారించి, వెన్నెముకకు బలం చేకూర్చుకోవాలనుకుంటే ‘స్పైన్‌ స్ట్రెంతెనింగ్‌ యోగా’ మంచిది. రోజూ సాధన చేస్తే వెన్ను బలపడుతుంది. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు బ్యాక్‌ పెయిన్‌ వచ్చినా, నడుం స్టిఫ్‌గా ఉన్నా కాసేపు వీటిని చేస్తే తక్షణ ప్రయోజనం ఉంటుంది.

రెండు కాళ్లూ దగ్గరగా పెట్టి తిన్నగా నిలబడి, కుడికాలును కుర్చీ మీద ఉంచాలి. రెండు చేతులనూ భుజాలకు సమాంతరంగా జాపి, మెల్లగా కుడివైపు తిప్పాలి. భుజాలను ఎంత వరకూ సాధ్యమవుతుందో అంతవరకూ తిప్పి పది క్షణాలు ఆ భంగిమలో ఆగాలి. తర్వాత మెల్లగా శ్వాస పీలుస్తూ మధ్యలోకి రావాలి. ఇలా మూడుసార్లు చేసిన తర్వాత ఇదేవిధంగా ఎడమకాలు కుర్చీ మీద పెట్టి చేతులు జాపి ఎడమవైపు సాధ్యమైనంత తిప్పుతూ మూడుసార్లు చేయాలి. దీనితో నడుం పట్టేయడం వెంటనే తగ్గుతుంది. కటి, వక్షస్థలం, మెడ నుంచి గర్భాశయం వరకూ ఉన్న భాగమంతా బలోపేతమవుతుంది. వెన్నెముక కదలికలు తేలికవుతాయి.

ఇది చేయడం వల్ల వెన్ను నొప్పి రాదు. కుర్చీలో కూర్చుని కుడికాలి మడమను ఎడమ మోకాలి మీద ఉంచాలి. ఎడమకాలును తిన్నగా ఉంచాలి. ఎడమ చేతిని కుడికాలి మడమ మీద ఉంచి, కుడిచేతిని కుడి మోకాలి మీద పెట్టాలి. మెల్లగా శ్వాస వదులుతూ ముందుకు వంగాలి. తలను ఒక్కసారిగా వంచొద్దు. మొదట ఉదరభాగాన్ని ముందుకు తెచ్చి, తర్వాత తలను దించాలి. ఐదారు క్షణాలలా ఉండి, మెల్లగా ఊపిరి పీలుస్తూ యథాస్థితిలో కూర్చోవాలి. మూడుసార్లు అయ్యాక, రెండో కాలితోనూ ఇలాగే చేయాలి. ఈ యోగసాధన చాలా మెల్లగా జరగాలి. వ్యాయామం చేసినట్లు హడావుడిగా, వేగంగా చేయకూడదు. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. దీనితో వెన్ను వంచడం తేలికవుతుంది. నడుంనొప్పి తగ్గుతుంది. నడుం బిగుతుగా ఉండటం, పట్టేసినట్లుండటం తగ్గుతుంది. వెన్ను సంబంధ సమస్యలు తీవ్రంగా ఉన్నా, గాయాలున్నా.. ఇది చేయకండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్