ఎండుద్రాక్ష ఎంత మంచిదో!

తేనెకు ఘనరూపం ఇచ్చినట్టుండే కిస్‌మిస్‌ను ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఉండరు. తీయతీయటి ఎండుద్రాక్ష రుచిలోనే కాదు, లాభాలు చేకూర్చడంలోనూ ముందు వరుసలోనే ఉంటుంది. కిస్‌మిస్‌లో నలుపు, లేత పసుపు, తేనెరంగు.. చిన్నవి, పెద్దవి..

Updated : 02 Aug 2022 08:19 IST

తేనెకు ఘనరూపం ఇచ్చినట్టుండే కిస్‌మిస్‌ను ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఉండరు. తీయతీయటి ఎండుద్రాక్ష రుచిలోనే కాదు, లాభాలు చేకూర్చడంలోనూ ముందు వరుసలోనే ఉంటుంది. కిస్‌మిస్‌లో నలుపు, లేత పసుపు, తేనెరంగు.. చిన్నవి, పెద్దవి.. ఇలా అనేక రకాలున్నాయి. అన్నీ మేలు చేసేవే. రోజుకు ఆరు నుంచి పది వరకూ తింటే మంచిదని, నానబెట్టుకుని తినడం వల్ల అధిక ప్రయోజనమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు...

* ఎండుద్రాక్ష స్త్రీలకు చాలా మంచిది. అందునా నల్ల కిస్‌మిస్‌ మరీ మేలైనది. నీరసం, నిస్సత్తువలను తగ్గించి శక్తినిస్తుంది.

* మితంగా తిన్నప్పటికీ థైరాయిడ్‌ లాంటి సమస్యలతో శరీర బరువు పెరిగి బాధపడుతున్న మహిళలకు ఎండుద్రాక్ష వరం లాంటిదే. ఇందులో తక్కువ కేలరీలు ఉన్నందున ఊబకాయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.

* కిస్‌మిస్‌లో పీచు ఉంటుంది కనుక జీర్ణప్రక్రియకు దోహదం చేస్తుంది.

* క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, సి-విటమిన్‌లు ఉన్నందున మంచి పోషకాహారం.

* తక్కువ సోడియం, అధిక పొటాషియం ఉన్నందున రక్తపోటును క్రమబద్ధం చేస్తాయి.

* కిస్‌మిస్‌లో ఉన్న విటమిన్‌, ఎ-కెరొటెనాయిడ్‌, బీటా కెరొటెన్‌లు కంటిచూపును మెరుగుపరుస్తాయి.

* ఇందులోని క్యాల్షియం ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటానికి సాయపడుతుంది.

* ఎండుద్రాక్ష రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

* సంతానోత్పత్తి సమస్యలను నివారించడంలోనూ ఉపయోగ పడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. బ్లడ్‌ క్లాట్స్‌ ఏర్పడకుండా చూస్తుంది. జుట్టును సంరక్షిస్తుంది. క్యాన్సర్‌ కారకాలను నివారిస్తుంది.

* ఎనీమియా రాకుండా ఉండాలంటే నానబెట్టిన ఎండుద్రాక్ష  తినడం అలవాటుగా చేసుకోండి.

* ఉదరం, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడంలో కిస్‌మిస్‌ ఔషధంలా పనిచేస్తుంది.

* లడ్డూ, సేమ్యా, క్యారెట్‌ హల్వా, ఫ్రూట్‌ సలాడ్స్‌ లాంటి అనేక స్వీట్లలో కిస్‌మిస్‌ అదనపు రుచి, ప్రత్యేక ఆకర్షణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్