చీజ్‌ తింటున్నారా?

వేడివేడి చీజ్‌ దోసె, శాండ్‌విచ్‌ వంటి వాటి రుచి భలే ఉంటుంది. కానీ ఇవి పెద్ద వాళ్లకు మంచిదేనా అనేది చాలా మంది అనుమానం. అందుకే దాన్ని రుచి చూడటానికి కూడా జంకుతారు. చీజ్‌ని మితంగా తింటే.. ప్రయోజనం అంటున్నారు నిపుణులు....

Published : 04 Aug 2022 18:19 IST

వేడివేడి చీజ్‌ దోసె, శాండ్‌విచ్‌ వంటి వాటి రుచి భలే ఉంటుంది. కానీ ఇవి పెద్ద వాళ్లకు మంచిదేనా అనేది చాలా మంది అనుమానం. అందుకే దాన్ని రుచి చూడటానికి కూడా జంకుతారు. చీజ్‌ని మితంగా తింటే.. ప్రయోజనం అంటున్నారు నిపుణులు....

* ముప్పైదాటిన తర్వాత మన ప్రధాన సమస్య ఎముకలు బలహీనపడటం. వయసు పెరిగేకొద్దీ అవి గుల్లబారుతుంటాయి. దీనికి పరిష్కారం విటమిన్‌ డి గుణాలున్న చీజ్‌. చీజ్‌ ఆస్టియోపొరోసిస్‌ రాకుండా అడ్డుకుంటుంది.

* దంతాలు అరిగిపోవడానికీ, రంధ్రాలు పడటానికి, చక్కెర్లు ఎక్కువగా తినడం, నోట్లో పీహెచ్‌ స్థాయిలు తక్కువగా ఉండటం కారణాలు. కానీ చీజ్‌, చక్కెరలేని పెరుగు వంటివి తిన్నప్పుడు నోట్లో పీహెచ్‌ స్థాయిలు పెరిగి దంతాలు అరిగిపోవని, రంధ్రాలు పడవని అధ్యయనాలు చెబుతున్నాయి.

* మంచి జుట్టు, చర్మం కావాలనుకొనేవారికి చీజ్‌ చక్కని ప్రత్యామ్నాయం. చీజ్‌ నుంచి ప్రొటీన్‌ని అందిపుచ్చుకోవచ్చు. అయితే.. తేమలేని చీజ్‌ రకాలనే ఎంచుకోవాలి. చీజ్‌ క్యూబ్స్‌, స్ప్రెడ్స్‌ రెండూ దొరుకుతాయి. క్యూబ్స్‌లో ఎక్కువ ప్రోటీన్లుంటాయి.

* బి-12లోపం ఉన్నవారు ఇది తింటే మంచిది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరం అయిన మంచి కొవ్వులని చీజ్‌ అందిస్తుంది.

* గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండటానికీ... తల్లికి తగిన పాళ్లలో విటమిన్లు, ఖనిజాలు అందుకోవడానికీ చీజ్‌ సహకరిస్తుంది.

* విటమిన్‌ కె2ని మిరకిల్‌ విటమిన్‌ అంటారు. కారణం.. మెదడు చురుగ్గా పనిచేయడానికీ, జుట్టు, చర్మం, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికీ అవసరం అయిన విటమిన్‌ ఇది. చీజ్‌ తినేవారికి కె2 పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా ఆవుపాలతో చేసిన గౌడ చీజ్‌లో ఈ సుగుణాలు ఎక్కువట.

ఎన్ని ప్రయోజనాలున్నా.. చీజ్‌ని మితంగానే తినాలి. చీజ్‌ని ఇష్టంగా తినేవారు వ్యాయామం చేయకపోతే తేలిగ్గా బరువు పెరుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్