భలే మంచి టీ..

టీకి సాటి టీనే! ఉదయమైనా, సాయంత్రమైనా టీ తాగుతుంటే మనసుకి హాయిగా ఉంటుంది. అంతేకాదు, శరీరానికీ చాలా లాభాలున్నాయి. మెదడు చురుగ్గా పని చేయడంలో టీ కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ అధ్యయనం ప్రకారం టీ అలవాటున్న వారికి అభిజ్ఞా నైపుణ్యాల (ఆలోచనాశక్తి, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత) తగ్గుదలని నెమ్మది చేస్తుంది. ...

Updated : 05 Aug 2022 15:19 IST

టీకి సాటి టీనే! ఉదయమైనా, సాయంత్రమైనా టీ తాగుతుంటే మనసుకి హాయిగా ఉంటుంది. అంతేకాదు, శరీరానికీ చాలా లాభాలున్నాయి.

మెదడు చురుగ్గా పని చేయడంలో టీ కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ అధ్యయనం ప్రకారం టీ అలవాటున్న వారికి అభిజ్ఞా నైపుణ్యాల (ఆలోచనాశక్తి, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత) తగ్గుదలని నెమ్మది చేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపుని తగ్గిస్తుంది. టీలోని యాంటీఆక్సిడెంట్లలో ఉండే పాలీఫినాల్స్‌ అందుకు కారణమట. టీలోని వివిధ రకాల మూలకాలవల్ల సృజనాత్మకత, సమస్యా పరిష్కార సామర్థ్యాలు పెరుగుతాయి.

టీలోని మూలకాలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నిలువరిస్తాయి. అంతేకాదు ఇది పొట్టలోని భాగాలకు వచ్చే క్యాన్సర్లను తగ్గిస్తుంది. చర్మ సంబంధిత క్యాన్సర్‌లని నిరోధిస్తుంది.

బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆఫ్తల్‌మాలజీలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం అంధత్వానికి ప్రధాన కారణాల్లో ఒకటైన నీటికాసులు (గ్లకోమా)ని రోజూ ఒక కప్పు టీ తాగడం వల్ల 74 శాతం వరకూ తగ్గించుకోవచ్చు.

తేయాకు మొక్కలు నేలలోని ఫ్లోరైడ్‌ని శోషించుకుంటాయి. టీ లోని ఫ్లోరైడ్‌ దంత క్షయాన్ని 40 శాతం మేర తగ్గించగలదు. రోజూ మూడు కప్పులు బ్లాక్‌ లేదా గ్రీన్‌ టీ నోటిలోని హానికర బ్యాక్టీరియాని తగ్గిస్తుంది.

ఓ డచ్‌ అధ్యయనం ప్రకారం రోజూ కనీసం మూడు కప్పులు టీ తాగే వాళ్లలో హృద్రోగ ముప్పు తాగని వారికంటే 45 శాతం తక్కువగా ఉంటుంది. టీలోని యాంటీ ఆక్సిడెంట్లు (ఫ్లేవనాయిడ్స్‌) దీనికి కారణమని భావిస్తున్నారు. ఇది పక్షవాతం, గుండె జబ్బులకు ప్రధాన కారణమైన రక్తపోటును తగ్గిస్తుంది. రక్తపోటుని తగ్గించడంలో బ్లాక్‌ టీకి పది శాతం ప్రభావం ఉండగా, గ్రీన్‌ టీకి 46 శాతం ఉంటుంది.

రోజూ కనీసం మూడు కప్పులు టీ తాగే వాళ్లలో టైప్‌-2 మధుమేహం ముప్పు తగ్గుతుంది. ఇది ఇన్సులిన్‌ విడుదలకు సాయపడుతుంది. అయితే ఈ విషయంలో డికాక్షన్‌ ద్వారా ఎక్కువ లాభాలుంటాయి. గ్రీన్‌ టీ వల్ల కాలేయానికి ఎన్నో లాభాలున్నాయి.
ఏదైనా అతి మంచిది కాదు. గ్రీన్‌, బ్లాక్‌ ఏ టీనైనా రోజులో మూడు కప్పులకు పరిమితం చేయడమే మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్