నిద్ర పట్టడం లేదు..

ఇల్లు, పిల్లలంటూ రోజంతా గిరగిరా తిరుగుతూ అలసినా.. కొందరికి నిద్రమ్మ మాత్రం దరిచేరదు. పక్క మీద దొర్లడంలోనే తెల్లారుతుంది. పగలు మళ్లీ పని. ఇది అలసటకే కాదు.. అనారోగ్యాలకీ దారి తీస్తుంది. మరేం చేయాలి? పిల్లలు మధ్యలో లేస్తారేమో, పరీక్షలు ఎలా రాస్తారో, సబ్మిట్‌ చేయాల్సిన అసైన్‌మెంట్లు.. ఒకటా రెండా.. బుర్రలో ఇన్ని మెదులుతోంటే ఇక నిద్రెక్కడి నుంచి వస్తుంది. ఎక్కడ మర్చిపోతామోనన్న భయమూ

Published : 06 Aug 2022 00:44 IST

ఇల్లు, పిల్లలంటూ రోజంతా గిరగిరా తిరుగుతూ అలసినా.. కొందరికి నిద్రమ్మ మాత్రం దరిచేరదు. పక్క మీద దొర్లడంలోనే తెల్లారుతుంది. పగలు మళ్లీ పని. ఇది అలసటకే కాదు.. అనారోగ్యాలకీ దారి తీస్తుంది. మరేం చేయాలి?

పిల్లలు మధ్యలో లేస్తారేమో, పరీక్షలు ఎలా రాస్తారో, సబ్మిట్‌ చేయాల్సిన అసైన్‌మెంట్లు.. ఒకటా రెండా.. బుర్రలో ఇన్ని మెదులుతోంటే ఇక నిద్రెక్కడి నుంచి వస్తుంది. ఎక్కడ మర్చిపోతామోనన్న భయమూ ఇందుకు కారణమే. మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తున్న వాటన్నింటినీ ఒక పేపరు మీద పెట్టండి. ఒత్తిడి తగ్గడమే కాదు.. రాసుకొని ఉంచుతారు కదా.. మరుసటి రోజు ఏమేం చేసేశారో, ఇంకేం చేయాలన్న వాటిపైనా స్పష్టత ఉంటుంది. మనసును తేలిక పరచడంలో ఈ ప్రక్రియ బాగా సాయపడుతుంది.

మరుసటి రోజు ఏదైనా పని ఉందనుకోండి.. త్వరగా నిద్రపోవాలి, పొద్దున్నే లేవాలి అని పదే పదే అనుకుంటుంటాం. గమనించారా! ఇదీ మెదడుపై ఒత్తిడికి కారణమవుతుందట. కాబట్టి.. నిద్ర పోవడానికి ప్రయత్నించక.. పడుకొన్నాక తదేకంగా పైకప్పును చూడండి. దృష్టంతా దానిపైనే ఉంచండి.. ‘నిద్ర’ ఒత్తిడి దూరమై, సహజంగా నిద్ర పడుతుందట.

సమస్య ఉంటే.. అదీ రాత్రిపూటే గుర్తొస్తుంది. నిపుణులు అధ్యయనం చేసి మరీ చెప్పిన మాట ఇది. ఖాళీ దొరికింది కదా అనుకొని రాత్రి సమయంలో వీటన్నింటినీ ఆలోచిస్తుంటారట ఆడవాళ్లు. ఫలితమే కలత నిద్ర. వీటన్నింటితో మనసు నిండొద్దంటే అక్షరాల ఆట ఆడేయండి. ఏం లేదు.. ఏదైనా పదాన్ని ఉదాహరణకు యాపిల్‌ అనుకోండి. దాన్ని స్పెల్లింగ్‌, తర్వాత దానిలోని ఒక్కో అక్షరంతో ఇంకెన్ని పదాలు గుర్తొస్తాయో ఆలోచించుకోండి. వాటి రూపాన్ని ఊహిస్తూ చేయండి. ఎప్పుడు నిద్ర పోయారో
కూడా తెలీదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్