నేతి కాఫీ తెలుసా!

బ్లాక్‌, చాక్లెట్‌, కోల్డ్‌.. అంటూ బోలెడు కాఫీలు తాగుంటారు. మరి.. ఘీ కాఫీ? కాఫీలో నెయ్యేంటీ అని ఆశ్చర్యపోకండి. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది అంటున్నారు నిపుణులు.  అమ్మాయిలు, మహిళల్లో హార్మోనుల్లో అసమతౌల్యత పెద్ద సమస్య. ఘీ కాఫీ ఆ సమస్యను అదుపులోకి తేవడంలో సాయపడుతుంది అంటున్నారు నిపుణులు....

Published : 07 Aug 2022 00:46 IST

బ్లాక్‌, చాక్లెట్‌, కోల్డ్‌.. అంటూ బోలెడు కాఫీలు తాగుంటారు. మరి.. ఘీ కాఫీ? కాఫీలో నెయ్యేంటీ అని ఆశ్చర్యపోకండి. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

అమ్మాయిలు, మహిళల్లో హార్మోనుల్లో అసమతౌల్యత పెద్ద సమస్య. ఘీ కాఫీ ఆ సమస్యను అదుపులోకి తేవడంలో సాయపడుతుంది అంటున్నారు నిపుణులు. ఆరోగ్యం బాగుండాలి, బరువు తగ్గాలి అనుకునే వారికి ఘీ కాఫీ ఉత్తమ ఎంపిక. కప్పు కాఫీలో టేబుల్‌ స్పూను నెయ్యి కలిపి పరగడుపునే తీసుకోమంటున్నారు. దీనివల్ల తర్వాత ఏం తీసుకున్నా శరీరంలో ఇన్సులిన్‌ శాతం పెరగకుండా చూసుకుంటుందట. మధు మేహం, మెటబాలిజం సమస్యలున్న వారు దీనిని ప్రయత్నించవచ్చు. కెఫిన్‌తో కొందరిలో ఆందోళన లాంటివి పెరుగుతాయట. అలాంటి వాటిని నెయ్యి తగ్గిస్తుంది.

నెయ్యి ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేయడమే కాదు.. త్వరగా శక్తినిస్తుంది. దీన్నో కొవ్వు పదార్థంగా చూస్తాం కానీ.. జీర్ణక్రియను మెరుగుపరుస్తూ శరీరంలో పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది. అలా బరువును అదుపు చేయడంలోనూ సాయపడుతుంది. పాలు, నెయ్యి పడని వారు మాత్రం డైటీషియన్‌ సలహా తీసుకోవడం మంచిది.

మెటబాలిజం మెరుగు పడాలంటే ఉదయాలను కొవ్వు, ప్రొటీన్లతో కూడిన ఆహారంతో మొదలు పెట్టాలంటారు. అలాంటివారూ ఘీ కాఫీని పరగడుపున ఎంచుకోవచ్చట. వ్యాయామానికి ముందు దీన్ని తీసుకుంటే శరీరానికి ఇంధనంగా పనిచేస్తుంది. అయితే రోజులో రెండుసార్లకు మించి మాత్రం ఈ కాఫీ వద్దు. ముఖ్యంగా సాయంత్రం 5 తర్వాత దీన్ని తీసుకోవద్దు.  నిద్రలేమికి కారణమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్