ఓపిక తగ్గుతోంటే..

వాతావరణ మార్పులు ఒక కారణమైతే.. వేళకి తినకపోవడం, పనంటూ ఉరుకులు పరుగులు... లాంటివన్నీ మనకు నీరసం తెప్పించేవే! అందుకే పని అలా పూర్తవగానే ఒంట్లో సత్తువంతా ఆవిరై పోయినట్లుగా కూర్చుండి పోతాం. దీనికి చెక్‌ పెట్టాలంటే..

Published : 25 Sep 2022 02:22 IST

వాతావరణ మార్పులు ఒక కారణమైతే.. వేళకి తినకపోవడం, పనంటూ ఉరుకులు పరుగులు... లాంటివన్నీ మనకు నీరసం తెప్పించేవే! అందుకే పని అలా పూర్తవగానే ఒంట్లో సత్తువంతా ఆవిరై పోయినట్లుగా కూర్చుండి పోతాం. దీనికి చెక్‌ పెట్టాలంటే..

* ఇంట్లోవాళ్లకి బాగోకపోతే దగ్గరుండి సపర్యలు చేస్తాం. మన విషయానికొచ్చేసరికి ఒక ట్యాబ్లెట్‌ వేసుకొని తిరిగి పనిలో పడతాం. తగినంత విశ్రాంతి లేకపోతే శరీరం మాత్రం ఎలా కోలుకుంటుంది? ఇలాంటప్పుడూ అన్నీ దగ్గరుండి చేయాలన్న తాపత్రయం వద్దు. ఇంకాస్త నీరసపడిపోతారు. చిన్నచిన్న పనుల వరకూ సరే! మిగతావి ఇంట్లోవాళ్లకి అప్పజెప్పండి.

* పిల్లలు మిగిల్చారనో, అప్పటికప్పుడు ఆకలికి చెక్‌ చెప్పొచ్చని చల్లగా మారినవి, టీ బిస్కెట్లను తీసుకుంటున్నారా? ఇవీ నీరసాన్ని పెంచేవే. సమయం లేదనుకున్నప్పుడు పల్లీలు, నట్స్‌, పండ్లు వంటివి తీసుకోండి. వృథా అవుతాయని మీ పొట్టలో మాత్రం వేయొద్దు.

* రోజూ మీ ఆహారంలో పప్పుధాన్యాలు, గింజలను తప్పనిసరి చేసుకోండి. తగినంత ప్రొటీన్‌ అందితేనే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. తేలికపాటి వ్యాయామాల్నీ దినచర్యలో తప్పక భాగం చేసుకోవాలి. విటమిన్‌ ఇ కణాలపై ఒత్తిడి కలగకుండా చూసుకుంటుంది. ఇది ఎక్కువగా ఉండే గుమ్మడి విత్తనాలు, బాదం వంటివాటిని ఎక్కువగా తినాలి.

* చివరగా.. పనంతా పూర్తయ్యాక తప్పదు కాబట్టి నిద్ర అన్నట్లుగా కాక ఒక సమయాన్ని నిర్దేశించుకోండి. పని పూర్తయినా కాకపోయినా ఆ సమయానికి పడుకునేలా చూసుకోండి. నిద్రలేమి కూడా నీరసానికి కారణమే! సమయం ఉంటే పగలైనా చిన్న కునుకు తీయండి. దీంతోపాటు తగినంత నీరూ తీసుకుంటే నీరసానికి చెక్‌ పెట్టేయడం సులువే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్