మాడుకు సహజ స్క్రబ్బింగ్‌..

రసాయనాలున్న షాంపూ స్నానంతో పొడారడం, లేదా బయటకు వెళ్లినప్పుడు మురికి చేరి ఫంగస్‌గా మారి మాడు దురద మొదలవుతుంది. చుండ్రు సమస్యతో రక్తప్రసరణలో అంతరాయం కలిగి, శిరోజాలు రాలడం ప్రారంభమవుతుంది.

Published : 27 Sep 2022 00:46 IST

రసాయనాలున్న షాంపూ స్నానంతో పొడారడం, లేదా బయటకు వెళ్లినప్పుడు మురికి చేరి ఫంగస్‌గా మారి మాడు దురద మొదలవుతుంది. చుండ్రు సమస్యతో రక్తప్రసరణలో అంతరాయం కలిగి, శిరోజాలు రాలడం ప్రారంభమవుతుంది. వీటన్నింటికీ సహజ స్క్రబ్బింగ్‌తో దూరంగా ఉంచొచ్చంటున్నారు నిపుణులు.

క గిన్నెలో చెంచా చొప్పున యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌, కొబ్బరినూనె, అరకప్పు ఉప్పు, చెంచా తేనె వేయాలి. బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మృదువుగా మునివేళ్లతో మర్దన చేయాలి. పావుగంట ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. మాడుపై చేరిన ఫంగస్‌ను యాపిల్‌సిడర్‌ వెనిగర్‌ దూరం చేసి, శిరోజాలు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహద పడుతుంది. కొబ్బరినూనె, తేనెలోని పోషకాలు మాడును పొడారనివ్వకుండా పరిరక్షిస్తాయి. మాడుపై మురికిని ఉప్పు పీల్చుకొని బయటికి పంపుతుంది. ఈ మిశ్రమం సహజ స్క్రబ్‌గా పనిచేస్తుంది. శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. వారం పది రోజులకొకసారి ఈ స్క్రబ్బింగ్‌ చేయడం మంచిది. 

ఆలివ్‌నూనెతో..

చెంచా చొప్పున నిమ్మరసం, ఆలివ్‌ నూనె, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని మాడుకు రాయాలి. తర్వాత అయిదు నిమిషాలు మృదువుగా స్క్రబ్‌ చేసి, రసాయనరహిత షాంపూతో తలస్నానం చేయాలి. మాడుపై మురికి, మృత కణాలను నిమ్మరసం దూరం చేయడమే కాదు, రక్తకణాలను శుభ్రపరిచి రక్తప్రసరణ మెరుగ్గా జరగడానికి దోహదపడుతుంది. ఏ, ఈ విటమిన్లు ఉండే ఆలివ్‌నూనె మాడు, శిరోజాలకు పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. కనీసం పదిరోజులకొకసారి ఈ స్క్రబ్‌ వేస్తే ఒత్తైన జుట్టు సొంతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్