అమృత సమానం అంజీరా..

మెనోపాజ్‌లో కాల్షియం తగ్గి ఎముకలు బలహీనపడుతున్నప్పుడు ఎండు అంజీరా ఆ లోటు తీరుస్తుంది. అధిక బరువు సహా పలురకాల అనారోగ్యాలను అదుపులో ఉంచుతుంది. మహిళల ఆరోగ్యం మొత్తానికి అంజీరా అమృత సమానం అంటున్నారు ఆహారనిపుణులు.

Updated : 03 Oct 2022 14:25 IST

మెనోపాజ్‌లో కాల్షియం తగ్గి ఎముకలు బలహీనపడుతున్నప్పుడు ఎండు అంజీరా ఆ లోటు తీరుస్తుంది. అధిక బరువు సహా పలురకాల అనారోగ్యాలను అదుపులో ఉంచుతుంది. మహిళల ఆరోగ్యం మొత్తానికి అంజీరా అమృత సమానం అంటున్నారు ఆహారనిపుణులు.

అత్తిపండుగా పిలిచే అంజీరా ఎండు ఫలం మహిళలెదుర్కొనే ఆరోగ్యసమస్యలకు పరిష్కారాన్ని అందిస్తుంది. ఎండిన అంజీరాను ఎక్కువసేపు నమలడంతో నోట్లో లాలాజలం ఊరి జీర్ణశక్తి పెరుగుతుంది. కొవ్వు, కొలెస్ట్రాల్‌, సోడియం తక్కువగా ఉండే ఇందులో, ఎక్కువ పీచు, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. రాత్రంతా నీటిలో నానబెట్టిన అంజీరాను తేనెతో కలిపి పరగడపున తీసుకుంటే మెరుగైన జీర్ణశక్తిసహా ఆరోగ్యపరమైన ప్రయోజనాలెన్నింటినో పొందొచ్చు.

* అంజీరాలో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారంలో వీటిని చేర్చుకుంటే మంచిది. ముఖ్యంగా మెనోపాజ్‌లోకి అడుగు పెడుతున్నప్పుడు ప్రతిరోజూ వీటిని తీసుకోవాలి. అలాగే ఇందులోని అధిక పీచు మలినాలను బయటకు పంపుతుంది. వీటి ద్వారా అతి తక్కువ కెలోరీలు శరీరానికి అందుతాయి. దీంతో అధిక బరువుకు దూరంగా ఉండొచ్చు. ఆకలిగా అనిపిస్తే అంజీరాను ఎంచుకోవచ్చు.

* భోజనం తర్వాత స్వీట్లు, చాక్లొట్లు ఐస్‌క్రీం వంటివి తినే అలవాటున్నవారు వాటి స్థానంలో అంజీరాను తీసుకోవచ్చు.

* అంజీరాలోని క్లోరోజెనిక్‌ యాసిడ్‌, పొటాషియం రక్తంలోని చక్కెరస్థాయులను నియంత్రిస్తాయి. మధుమేహం ఉన్నవారు, చక్కెరస్థాయులు అదుపులో ఉంచాలనుకునేవారు ఈ ఎండుఫలాన్ని తీసుకోవచ్చు. జింక్‌, మాంగనీస్‌,
ఇనుము తదితర ఖనిజ లవణాలు ఈ పండులో మెండుగా ఉంటాయి. ఇవి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్ల అసమతుల్యత, మెనోపాజ్‌ తర్వాత వచ్చే పలురకాల సమస్యలకు గురికాకుండా ఈ పండు పరిరక్షిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్