నోరు కట్టుకోకుండానే.. తక్కువ కెలొరీలు!

అందం, ఆరోగ్యాలపై శ్రద్ధతో డైటింగ్‌ చేసే అమ్మాయిలే ఎక్కువ. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా.. పండగల వేళ నోరు కట్టుకోవడం కాస్త కష్టమే! నోరూరించే పిండి వంటలను చూస్తూ ఉండలేక తినేస్తారు. తర్వాత అయ్యో.. తినేశామే అన్న అపరాధ భావన! దాన్నుంచి తప్పించుకోవాలా..

Published : 05 Oct 2022 00:31 IST

అందం, ఆరోగ్యాలపై శ్రద్ధతో డైటింగ్‌ చేసే అమ్మాయిలే ఎక్కువ. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా.. పండగల వేళ నోరు కట్టుకోవడం కాస్త కష్టమే! నోరూరించే పిండి వంటలను చూస్తూ ఉండలేక తినేస్తారు. తర్వాత అయ్యో.. తినేశామే అన్న అపరాధ భావన! దాన్నుంచి తప్పించుకోవాలా..

ఇంట్లో చేసిన వాటికే ప్రాధాన్యమివ్వండి. ఎలాంటి నూనె, పదార్థాలు వాడారోనన్న బెంగ ఉండదు. ఎంతెంత పరిమాణాల్లో వాడారో తెలిసి ఉంటుంది. కాబట్టి, ఎంతమేరకు తినొచ్చో చూసుకోవచ్చు. పైగా సొంతంగా చేసుకుని తింటే ఆ తృప్తి వేరు కదా.

పండగంటేనే ఆనందం. ఆ సమయంలో నోరు కట్టుకొని కూర్చుంటే మనసుకు బాధనిపించదూ! ఇక ముఖంపై చిరునవ్వెలా వస్తుంది? తినండి. కాకపోతే తినే మొత్తంపై మాత్రం ఆంక్షలు పెట్టుకొంటే సరి! తిన్నామన్న తృప్తీ ఉంటుంది, డైట్‌ను తప్పామన్న బాధా ఉండదు.

తక్కువ ఫ్యాట్‌ పాలు, చక్కెర వాడితే కెలొరీలు ఎక్కువయ్యాయన్న బెంగ ఉండదు. చక్కెర బదులు బెల్లం, ఇతర ప్రత్యామ్నాయాలను వాడితే ఇంకా మంచిది. లో ఫ్యాటే కదా అనీ ఎక్కువగా తినొద్దు. నెయ్యి, నూనెలను తక్కువగా ఉపయోగించే కిటుకులను పాటిస్తే నచ్చినట్లుగా తినొచ్చు.

పిండి వంటల్లాంటివి తినాలనిపించిన ప్రతి సారీ ఒక గ్లాసు నీటిని తాగేయండి. కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది కదా! ఎక్కువ తినలేరు. అలానూ కెలొరీలు తగ్గుతాయి. ఒక్కరోజే కదా.. ఏమవుతుందన్న ధోరణీ మంచిది కాదు. సాయంత్రం తర్వాత తీపి పదార్థాలను తీసుకోవద్దు. తినాలనిపించినా ఆ స్థానంలో పండును ఎంచుకుంటే సరి. కబుర్లు, వేడుకల్లో పడి వ్యాయామాన్నీ మర్చిపోతాం. కానీ ఓ అరగంటైనా నడవండి. నడుస్తూ కబుర్లు చెప్పుకోవడం, ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు నడవడం లాంటివీ లాభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్