వయసును దాచే.. సీతాఫలం

సీతాఫలంలో ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, పీచు, పిండిపదార్థాలు, పొటాషియం, సోడియం, ఐరన్‌లు ఉన్నందున మంచి పోషకాహారం.

Published : 07 Oct 2022 00:15 IST

* సీతాఫలంలో ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, పీచు, పిండిపదార్థాలు, పొటాషియం, సోడియం, ఐరన్‌లు ఉన్నందున మంచి పోషకాహారం.

* ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

* ఇందులో దండిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని సూక్ష్మక్రిములతో పోరాడతాయి. రిబోఫ్లేవిన్‌ నోటిపూత రానీయదు.

* గుండెజబ్బులను నివారిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. వాపును తగ్గిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది.

* ఇందులోని యాంటీ క్యాన్సర్‌ గుణాలు క్యాన్సర్‌లను, ట్యూమర్లను నిరోధిస్తే, మెగ్నీషియం శరీరంలో నీటిని సమంగా ఉంచుతుంది. దానివల్ల కీళ్ల వద్ద ఆమ్లాల ఉత్పత్తిని నిరోధించినట్లవుతుంది.

* ఈ పండ్లలోని బి-కాంప్లెక్స్‌ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. విసుగు, యాంగ్జయిటీ, ఒత్తిడి, టెన్షన్‌, డిప్రెషన్‌ల బారి నుంచి కాపాడుతూ ఉత్సాహంగా ఉంచుతుంది.

* సీతాఫలం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ముడతలు పడదు, మృదుత్వం, నునుపుదనం వస్తాయి. యాంటీ ఏజెనింగ్‌ క్రీమ్‌లా పని చేస్తుందంటే అతిశయోక్తి కాదు. కురులు దృఢంగా, పట్టుకుచ్చులా ఉంటాయి.

* రక్తంలో హిమోగ్లోబిన్‌ తగ్గకుండా చేస్తుంది. మధుమేహం ఉన్నవారు కూడా తగిన మోతాదులో ఈ పండు తినొచ్చు. జలుబు, దగ్గు ఉంటే మాత్రం దీనికి దూరంగా ఉండటం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్