కొవ్వంతా పొట్టదగ్గరేనా?

లావైనా, సన్నమైనా... పొట్ట ఉబ్బెత్తుగా కనిపిస్తోంటే మాత్రం  మనకు చిరాగ్గా ఉంటుంది కదూ! తిన్నదంతా అక్కడే చేరుతుందనుకుంటాం. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటాం, వ్యాయామాలూ చేసేస్తుంటాం. కానీ దానికి ఇతర కారణాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. నిద్రలేమి, చక్కెరలు పెరగడం, హార్మోనుల్లో అసమతుల్యత, పీసీఓఎస్‌, ఒత్తిడి కూడా పొట్ట పెరగడానికి కారణమవుతాయి.

Published : 08 Oct 2022 00:36 IST

లావైనా, సన్నమైనా... పొట్ట ఉబ్బెత్తుగా కనిపిస్తోంటే మాత్రం  మనకు చిరాగ్గా ఉంటుంది కదూ! తిన్నదంతా అక్కడే చేరుతుందనుకుంటాం. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటాం, వ్యాయామాలూ చేసేస్తుంటాం. కానీ దానికి ఇతర కారణాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు.

నిద్రలేమి, చక్కెరలు పెరగడం, హార్మోనుల్లో అసమతుల్యత, పీసీఓఎస్‌, ఒత్తిడి కూడా పొట్ట పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి, ఎంత ప్రయత్నించినా పొట్ట తగ్గడం లేదని అనిపించినప్పుడు ముందు అసలు కారణం తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటేనే తగ్గించుకోవడం సాధ్యం. కాబట్టి, థైరాయిడ్‌, పీసీఓఎస్‌, హార్మోన్ల అసమతుల్యత వంటివి చెక్‌ చేయించుకోండి.

డైట్‌ అనగానే ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులను దూరం పెట్టేస్తారు చాలా మంది. అది మంచిది కాదు. ఆకుకూరలు, కూరగాయలకే పరిమితం కాక చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను తరచూ తీసుకోండి. అప్పుడే తగినంత ప్రొటీన్‌ అంది బరువు, కొవ్వు తగ్గుదల సాధ్యమవుతుంది.

ఒంట్లో పేరుకుపోయేది చెడు కొవ్వు. దాన్ని తగ్గించాలంటే శరీరానికి మంచి కొవ్వుల్ని అందించాలి. కొన్నిరకాల హార్మోన్ల ఉత్పత్తికీ ఇవి కావాలి. పూర్తిగా నూనె లేకుండా తీసుకునే ఆహారం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. వృద్ధాప్యఛాయలు, వెంట్రుకలు రాలడం వంటివి అదనం. రిఫైన్డ్‌ ఆయిల్‌, జంక్‌ఫుడ్‌ వంటివి తగ్గిస్తే చాలు. నూనె పూర్తిగా తగ్గించాల్సిన పనిలేదు.

నిద్ర శరీరాన్ని సహజంగా డిటాక్స్‌ చేస్తుంది. మరమ్మతులు చేసి, బరువు తగ్గడానికీ కారణమవుతుంది. నాణ్యమైన నిద్ర కనీసం 7 గంటలు ఉండేలా చూసుకోండి. ఒత్తిడికి గురవుతున్నారేమో గమనించుకొని దాన్ని తగ్గించుకొనే మార్గాలను వెతుక్కోండి. యోగా, ధ్యానం, జీవనశైలిలో మార్పులు వంటివి ఇందుకు సాయపడతాయి.

వ్యాయామం ఒకరోజు చేయడం ఇంకోసారి బద్ధకించడం వంటివొద్దు. రోజూ కనీసం కొద్దిసేపైనా తప్పక చేయాలి. గంటలకొద్దీ కూర్చోవడమూ కొవ్వు పేరుకోవడానికి కారణమే. అందుకే గంటకోసారి కుర్చీలోంచి లేవడం, స్ట్రెచ్‌లు వంటివి చేస్తుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్