అప్పుడూ హీల్స్‌ వేస్తున్నారా?

తారలు ఏం చేసినా ట్రెండే! వాళ్ల ప్రెగ్నన్సీ, ఫొటోషూట్‌లు, వ్యాయామాలు లాంటివి అనుసరిస్తున్న వారెందరో! ఫొటోషూట్‌ల్లో వాళ్లు హీల్స్‌ వేసుకుంటే దాన్నీ ట్రెండ్‌గా అనుసరిస్తున్నారట చాలామంది.

Updated : 10 Oct 2022 13:29 IST

తారలు ఏం చేసినా ట్రెండే! వాళ్ల ప్రెగ్నెన్సీ, ఫొటోషూట్‌లు, వ్యాయామాలు లాంటివి అనుసరిస్తున్న వారెందరో! ఫొటోషూట్స్‌లో వాళ్లు హీల్స్‌ వేసుకుంటే దాన్నీ ట్రెండ్‌గా అనుసరిస్తున్నారట చాలామంది. మీరూ ఆ జాబితాలో ఉన్నారా? అయితే ఇవి చెక్‌ చేసుకోండి.

* గర్భధారణ సమయంలో హీల్స్‌ వేసుకుంటే పడిపోయే ప్రమాదమెక్కువ. జారడం, దేనికైనా తగలడం వంటి అవకాశాలెక్కువ. ఇవి గర్భస్థ శిశువుకు ప్రమాదం కలిగించగలవు. ప్రమాదం పెద్దదైతే మీకు, శిశువుకీ ఇద్దరికీ ప్రాణాపాయమే.

* కడుపుతో ఉన్నప్పుడు రిలాక్సిన్‌ అనే హార్మోను విడుదలవుతుంది. ఇది శరీరంలో కండరాలను సేదతీరేలా చేస్తుంది. బిడ్డ పుట్టడానికి మార్గం సుగమం చేయడం దీని ఉద్దేశం. అయితే ఇది కాళ్లకీ వర్తిస్తుంది. ఈ సమయంలో ఎత్తు చెప్పులు కాళ్లని బాధిస్తాయి. అందుకే ఫ్లాట్స్‌ వేసుకోమని చెబుతుంటారు.

* కండరాలన్నీ వదులవుతోంటే పొత్తి కడుపు, నడుము, కాళ్ల నొప్పులు సాధారణం. హీల్స్‌.. జాయింట్లమీద భారం పడేలా చేస్తాయి. నడుముపైనా ఈ ప్రభావం పడి నొప్పులు పెరుగుతాయి. అసలే భారంగా ఉన్న శరీరానికి ఇవి అదనపు భారాన్ని చేర్చడమే! నరాలపైనా ఈ ప్రభావం ఉంటుంది. వాటిపై ఒత్తిడి పెరిగి బయటికి ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. గుండెకు రక్తసరఫరాలోనూ ఆటంకాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే ఫ్యాషన్‌ పక్కనపెట్టి.. సౌకర్యానికి ప్రాధాన్యమివ్వండి.

* మరి తారలు వేసుకుంటున్నారుగా.. అనే సందేహమొస్తోందా? వాళ్లు వైద్యుల సలహా తప్పక తీసుకుంటారు. పైగా గంటలకొద్దీ వేసుకోరు. కాబట్టి ఫొటో, వీడియోల కోసం వాళ్లని అనుసరిస్తే ముప్పు మీకే! ఈ విషయంలో వైద్యుల సలహాను అనుసరించడమే మేలు.


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు...

ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్