అందానికీ.. ఆరోగ్యానికీ అండ!

శరీరానికి పోషకాలన్నీ అందాలి.. బరువు మాత్రం పెరగొద్దు.. ఇదేగా మనం కోరుకునేది. అయితే  గుడ్డును ఎంచుకోమంటున్నారు నిపుణులు. పవర్‌ప్యాక్డ్‌ ఫుడ్‌గా చెప్పే ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందంటున్నారు..

Published : 14 Oct 2022 00:58 IST

శరీరానికి పోషకాలన్నీ అందాలి.. బరువు మాత్రం పెరగొద్దు.. ఇదేగా మనం కోరుకునేది. అయితే  గుడ్డును ఎంచుకోమంటున్నారు నిపుణులు. పవర్‌ప్యాక్డ్‌ ఫుడ్‌గా చెప్పే ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందంటున్నారు..

* బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. రోజూ ఆహారంలో రెండు గుడ్లను చేర్చుకోండి. ప్రొటీన్లు, ఆరోగ్య కరమైన కొవ్వులు దీనిలో పుష్కలం. ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉండి త్వరగా ఆకలేయకుండా చూడటమే కాదు.. మెటబాలిజాన్ని మెరుగుపరచి బరువును తగ్గించడంలోనూ సాయపడతాయి. దీనిలోని మంచికొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు, ట్రైగ్లిజరాయిడ్లకు వ్యతిరేకంగా పోరాడి, గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి.

* చర్మం ఆరోగ్యంగా, నిగ నిగలాడుతూ కనిపించడంలో సెలీనియంది ప్రధాన పాత్ర. ఇది గుడ్డులో పుష్కలంగా ఉంటుంది. దీన్ని రోజూ తీసుకుంటే చర్మాన్ని సంరక్షించి, ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. దీనిలోని లూటిన్‌, జెనాక్సాంథిన్‌... కణాలు పాడవకుండా కాపాడి, వృద్ధాప్య ఛాయల్ని దరిచేరన్వివు.

* రాత్రుళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయాన్నే లేవడం మనకు మామూలే. నిద్ర సరిపోనపుడు రోగనిరోధకత తగ్గుతాయి. దీంతో జలుబు వంటివి త్వరగా వచ్చేస్తుంటాయి. గుడ్డు పచ్చసొనలో విటమిన్‌ డి పుష్కలం. తరచూ జబ్బు పడుతున్నట్లు అనిపిస్తే గుడ్డును రోజూ తీసుకోండి. దీన్లోని విటమిన్లు, మినరల్స్‌ ఆరోగ్యంగా ఉంచుతాయి.

* ముదిమి వయసులో మతిమరపు సాధారణమే! కానీ నడి వయసు కూడా రాకముందే తరచూ మరచిపోతుంటే మాత్రం పట్టించుకోవాల్సిందే. బుర్రకు పని చెప్పడంతోపాటు రోజూ గుడ్డును తీసుకోండి. దీనిలో మెదడు ఆరోగ్యానికి సాయపడే విటమిన్‌ బి12, బీ6, కోలిన్‌, ఫోలేెట్లుంటాయి. మనకు రోజుకు కావాల్సిన కోలిన్‌లో 26% దీన్నుంచే భర్తీ చేసుకోవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు వీటిని రోజూ తీసుకుంటే పిల్లల మెదడు అభివృద్ధికి సాయపడుతుంది.

* హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం తరచూ గుడ్డు తీసుకునే వారిలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 44% తగ్గుతాయట. దీనిలోని కోలిన్‌ అనే న్యూట్రియంట్‌ దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్