థైరాయిడ్‌కు చెక్‌ చెబుదాం...

బోర్లా పడుకుని రెండు కాళ్లూ దగ్గరగా ఉంచాలి. రెండు చేతులూ ఛాతీ పక్కన ఉంచి అరచేతులను నేలమీద ఆనించాలి. చేతుల మీద బరువు వేస్తూ భుజాలను పైకి లేపాలి. తలను వీలైనంత వెనక్కి వంచాలి. రెండు కాళ్లనూ మడిచి పాదాలు తలను తాకేలా పైకి తీసుకురావాలి. కాళ్లు వంచలేకపోతే వచ్చినంత వరకే తీసుకెళ్లండి.

Published : 15 Oct 2022 00:56 IST

చాలామంది మహిళలను వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్‌ ఒకటి. ఈ గ్రంథిలో అపసవ్యతలు ఇతర అనారోగ్యాలకూ దారితీస్తున్నాయి. అందుకే నివారణోపాయంగా పూర్ణ భుజంగాసనం వేసి చూడండి.

బోర్లా పడుకుని రెండు కాళ్లూ దగ్గరగా ఉంచాలి. రెండు చేతులూ ఛాతీ పక్కన ఉంచి అరచేతులను నేలమీద ఆనించాలి. చేతుల మీద బరువు వేస్తూ భుజాలను పైకి లేపాలి. తలను వీలైనంత వెనక్కి వంచాలి. రెండు కాళ్లనూ మడిచి పాదాలు తలను తాకేలా పైకి తీసుకురావాలి. కాళ్లు వంచలేకపోతే వచ్చినంత వరకే తీసుకెళ్లండి. మొదట్లో తలకూ, పాదాలకూ మధ్య దూరం ఎక్కువున్నా క్రమంగా తగ్గి ఆనించగలుగుతారు.

ప్రయోజనాలు

థైరాయిడ్‌ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. వెన్నెముక బలపడుతుంది. స్పాండిలైటిస్‌, ఆర్థరైటిస్‌లను తగ్గిస్తుంది.

మెడ, ఉదరభాగం, ఊపిరితిత్తులు, భుజాలు, పొత్తికడుపు వద్ద ఒత్తిడి తగిలి ఆ భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. కండరాలు ఉత్తేజితమవుతాయి.

బరువు తగ్గుతుంది. నెలసరి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. విసుగు, కోపం, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

రక్తసరఫరా సాఫీగా ఉంటుంది. జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. నడుము, వెన్ను నొప్పులకు స్వస్తి చెప్పొచ్చు.

ఉబ్బసానికి చికిత్సలా పని చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్