వయసు తగ్గించే పసుపు..

వంటింట్లో దొరికే అద్భుతమైన సౌందర్య సాధనం పసుపు. ఇది వయసు ప్రభావాన్నీ కనిపించకుండా చేస్తుంది. ఎలాగంటే..

Published : 17 Oct 2022 00:28 IST

వంటింట్లో దొరికే అద్భుతమైన సౌందర్య సాధనం పసుపు. ఇది వయసు ప్రభావాన్నీ కనిపించకుండా చేస్తుంది. ఎలాగంటే..

* పసుపూ, సెనగపిండీ, పచ్చి పాలూ సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది యాంటీ ఏజింగ్‌గానూ పనిచేస్తుంది. తక్కువ మోతాదులో పసుపు వాడి వేసుకునే ఈ ప్యాక్‌ చర్మ ఛాయనీ మెరుగుపరుస్తుంది.

* ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వయసు కారణంగా వచ్చే ముడతలు రాకుండా నివారిస్తాయి. కొత్త కణాలనూ వృద్ధిచేస్తాయి. చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఆ ఫలితం రావాలంటే.. పసుపుని ముఖానికి రాసి, పది నిమిషాల తర్వాత నీళ్లతో కడగాలి.

* సమపాళ్లలో పసుపూ, బియ్యప్పిండీ, చెంచా చొప్పున పచ్చి పాలూ, టొమాటో రసం చేర్చి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. దీంతో కళ్లకింది నల్లటి వలయాలూ, ముడతలూపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్