నడకకు విరామం ఇవ్వొద్దు..

మహిళలు వ్యాయామం చేయాలనుకుంటే మొదట ఎంచుకునేమార్గం నడకే. అయితే, నాలుగు రోజులు చేసి మరో రోజు మానేసి...తిరిగి దాన్ని కొనసాగించడానికి ఇబ్బంది పడేవారు చాలామందే. ఈ ఇబ్బందిని అధిగమించి... మీ నడకను కొనసాగించడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.

Published : 17 Oct 2022 00:28 IST

మహిళలు వ్యాయామం చేయాలనుకుంటే మొదట ఎంచుకునేమార్గం నడకే. అయితే, నాలుగు రోజులు చేసి మరో రోజు మానేసి...తిరిగి దాన్ని కొనసాగించడానికి ఇబ్బంది పడేవారు చాలామందే. ఈ ఇబ్బందిని అధిగమించి... మీ నడకను కొనసాగించడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.

రోజూ సాగించే అరగంట నడక శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాదు... కండరాలనూ, ఎముకలనూ బలంగా మారుస్తుంది. నరాలవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ లోపాల్ని సరిచేసి, చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఇవన్నీ వృద్ధాప్యాన్ని త్వరగా దరికిరానివ్వవు. మరి ఇన్నిరకాల ప్రయోజనాలను అందించే నడకను మొదలుపెట్టినప్పుడు అరగంటో, గంటో అనుకుని నడవొద్దు. ముందుగా పది నిమిషాలు అనుకోవాలి. మరుసటి రోజు మరో అయిదు నిమిషాలు పెంచుకుంటూ వెళ్లాలి. నడక మధ్యలో వేగాన్ని తగ్గించి 20 సెకన్ల తర్వాత తిరిగి మొదటి వేగాన్ని అందుకోవాలి. ఇలా నడిస్తే అలసట తెలియకుండానే పూర్తిచేయొచ్చు.   

బరువులొద్దు...

నడిచేప్పుడు ఏ మాత్రం ఉత్సాహం తగ్గకూడదంటే వెంట బరువులుండొద్దు. వాటిని చేతిలో అసలు పెట్టుకోవద్దు. పైగా ఫోన్‌ వంటివి మీ దృష్టినీ మరల్చే అవకాశమూ ఉంది. అందుకే పాకెట్స్‌ ఉన్న ట్రాక్‌ ధరించి అందులో ఉంచుకుంటే సరి. కండరాల అలసట తెలియకుండా తేలికగా నడవొచ్చు.

* ఆఫీసుకి వెళ్లినా, షాపింగ్‌కి వెళ్లినా... లిఫ్ట్‌ని వాడకుండా మెట్లు ఎక్కిదిగడం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. నడకపై ఆసక్తి పెరుగుతుంది. ఉదయం... అనుకున్న సమయంకన్నా తక్కువగా నడిస్తే, మిగతాదాన్ని సాయంత్రం భర్తీ చేసుకోవడం మరవకూడదు. మొత్తానికి రోజూ కొంత సమయం నడవాలని అనుకుంటే దాన్ని రెండుమూడు భాగాలుగా చేసి కూడా  పూర్తి చేయొచ్చు.


సాంకేతికత సాయంతో...

* నడిచినప్పుడు ఎన్ని అడుగులు వేశాం. అందుకు ఎంత సమయం పట్టిందీ? ఎన్ని కెలోరీలు తగ్గుతున్నాయనే వివరాలు తెలిస్తే...మరింత ఉత్సాహంగా అడుగులు వేస్తాం. నడిచే అలవాటునీ ఇవి తప్పనివ్వవు. అందుకే స్మార్ట్‌ వాచ్‌ సాయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్