తేలికైన ఆసనం.. ప్రయోజనాలు అధికం..

ఇంట్లో మనది కీలక పాత్ర కనుక ఉదయం నుంచీ రాత్రి వరకూ ఏవో పనులు సరిపోతూనే ఉంటాయి. కానీ అదంతా వ్యాయామమే అనుకుంటే మాత్రం పొరపాటే. తీరికలేని పనులతో అలసట కలగొచ్చు కానీ అవి ఆరోగ్యానికి అవసరమైన కదలికలు కావు.

Published : 22 Oct 2022 02:46 IST

ఇంట్లో మనది కీలక పాత్ర కనుక ఉదయం నుంచీ రాత్రి వరకూ ఏవో పనులు సరిపోతూనే ఉంటాయి. కానీ అదంతా వ్యాయామమే అనుకుంటే మాత్రం పొరపాటే. తీరికలేని పనులతో అలసట కలగొచ్చు కానీ అవి ఆరోగ్యానికి అవసరమైన కదలికలు కావు. మనం శారీరకంగా, మానసికంగా ఉత్తేజితం కావాలన్నా, రుగ్మతల బారిన పడకూడదన్నా క్రమం తప్పక యోగాసనాలు వేయాలి లేదా వ్యాయామం చేయాలి. గతంలో థైరాయిడ్‌కు పూర్ణ భుజంగాసనం గురించి తెలుసుకున్నాం కదా! ‘విపరీత కరణి ఆసన ముద్ర’ కూడా ఆ సమస్యను నివారిస్తుంది. అదనపు ప్రయోజనాలూ చేకూరుస్తుంది.

ఎలా చేయాలంటే...

రెండు చేతులూ పక్కకు పెట్టి, కాళ్లు దగ్గరగా ఉంచి వెల్లకిలా పడుకోవాలి. తర్వాత మెల్లగా కాళ్లూ, చేతుల మీద బరువు మోపి, నడుమును, కాళ్లనూ పైకి లేపాలి. చిత్రంలో చూపిన విధంగా రెండు అర చేతులూ నడుము దగ్గర పెట్టుకోవాలి. కాళ్లను పైకి నిలబెట్టడంలో సుమారు 40 డిగ్రీల ఒంపు ఉంటుంది. ఇందుకు చేతుల ఆసరా తీసుకోండి. కానీ తర్వాత వాటి మీద మొత్తం బరువు మోపవద్దు. ఈ ఆసనం వల్ల థైరాయిడ్‌ సమస్య క్రమంగా నియంత్రణలోకి వస్తుంది.

ఇవీ లాభాలు...

శరీరానికి వ్యతిరేక దశలో ఒత్తిడి తగలడం వల్ల హైపో లేదా హైపర్‌ థైరాయిడ్‌ గ్రంథికి రక్త ప్రసరణ సాఫీగా సాగి అదుపులో ఉంటుంది. థైరాయిడ్‌తో బాధపడుతున్న వారికి వచ్చే ఇతర అనారోగ్యాల నుంచీ ఉపశమనం కలుగుతుంది. కురులు దృఢంగా ఉంటాయి. చర్మం పొడిబారదు, ముడతలు పడదు. జీర్ణ సంబంధ సమస్యల నుంచి బయట పడొచ్చు. గుండె, ఊపిరితిత్తులు తదితర భాగాలకూ ఈ ఆసనం ఎంతో మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్