నెలసరిలోనూ ఉత్సాహంగా..

అమలకు నెలసరి తేదీ దగ్గరపడుతుందంటే చాలు ఆందోళన. కాలేజీకెళ్లాలనిపించదు. ఊర్వశి పరిస్థితి కూడా ఇదే. ఆ సమయంలో ఆఫీస్‌లో పనిచేయాలనిపించదు. ఇలాకాకుండా నెలసరిలోనూ ఉత్సాహంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. దీనికి కొన్ని సూచనలు, చిట్కాలు చెబుతున్నారు.

Published : 26 Oct 2022 00:18 IST

అమలకు నెలసరి తేదీ దగ్గరపడుతుందంటే చాలు ఆందోళన. కాలేజీకెళ్లాలనిపించదు. ఊర్వశి పరిస్థితి కూడా ఇదే. ఆ సమయంలో ఆఫీస్‌లో పనిచేయాలనిపించదు. ఇలాకాకుండా నెలసరిలోనూ ఉత్సాహంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. దీనికి కొన్ని సూచనలు, చిట్కాలు చెబుతున్నారు.

క్కొక్కరికి ఒక్కోలా నెలసరి అనుభవం ఎదురవుతుంది. అందరిలో రక్తస్రావ తీవ్రత ఒకేలా ఉండదు. కొందరికి తక్కువగా, మరికొందరికి ఎక్కువగా కనిపించొచ్చు. ఆ సమయంలో కొందరికి ఏ పనీ చేయాలనిపించదు. ఇంకొందరికి ఎక్కువ ఆకలి ఉంటుంది. చాలామంది నెలసరి నొప్పికి గురవుతుంటారు. మరి వీటి నుంచి దూరంగా ఉండాలంటే ముందునుంచే కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముందుగా నెలసరి కోసం ప్రత్యేకంగా ఓ డైరీ అలవాటుండాలి. ప్రతి నెలా.. వచ్చే నెలసరి తేదీలు సహా, మొత్తం ఆ మూడునాలుగు రోజుల్లో ఏయే రోజులు రక్తస్రావం అధికంగా అవుతుందో వివరాలు పొందుపరుచుకోవాలి. ఆ ప్రకారం ప్యాడ్స్‌ లేదా కప్‌ వినియోగాన్ని ఎంపిక చేసుకోవాలి. వీటిని ముందే హ్యాండ్‌ బ్యాగులో పెట్టుకుంటే సరి. అలానే నొప్పికి వైద్యులు సూచించిన మాత్రలు కూడా బ్యాగులో ఉంటే మంచిది. అత్యవసరానికి ఇబ్బంది ఉండదు.అలాగే ప్యాడ్స్‌ ఎంపికలో మృదువైన వస్త్రం లేదా రసాయనరహితమైనవాటికి ప్రాముఖ్యతనిస్తే వాటివల్ల చెడు ప్రభావం కలగదు. తద్వారా అలర్జీలకు దూరంగా ఉండొచ్చు.

కండరాల బలోపేతానికి

నిత్యం వ్యాయామం తప్పనిసరి. ఉదయం లేదా సాయంత్రం కనీసం అరగంట వ్యాయామానికి కేటాయిస్తే కండరాలు బలోపేతమవుతాయి. శరీరంలో ఎండార్ఫిన్స్‌ విడుదలై మానసిక ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యంగా నెలసరిలో వచ్చే నొప్పులతో మొదలైన ఆందోళన, ఒత్తిడివంటి వాటి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

ఆరోగ్యపరంగా..

శరీరాన్ని ప్రతినెలసరికి సిద్ధంగా ఉంచాలంటే ఆరోగ్యంగా ఉండటం అత్యంత ముఖ్యం. రోజూ ఏడెనిమిది గ్లాసుల నీటిని తీసుకొంటే డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండొచ్చు. దీంతో నెలసరిలో వచ్చే తలనొప్పి, వికారం వంటివి తగ్గుతాయి. ఇనుము, మెగ్నీషియం, ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్లు ఉన్న ఆహారం తప్పనిసరి. వీటితో శారీరక సమస్యలను తట్టుకొనే శక్తి అందుతుంది. డార్క్‌ చాక్లెట్స్‌, గింజధాన్యాలుసహా అరటి, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్లను తీసుకుంటే, శారీరకంగా, మానసికంగా శక్తివంతులుగా ఉండొచ్చు. నెలసరిలోనూ నీరసం లేకుండా ఉత్సాహంగా బాధ్యతలను  నిర్వర్తించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్