సుగంధం.. ఆనందం..

అగరొత్తుల్లేని ఇళ్లుండవు కదూ! దేవుడి మందిరంలోనే కాదు, తాజాదనం కోసమూ అగరొత్తులు వెలిగించుకుంటాం. వాటితో ఎన్నెన్ని లాభాలు ఒనగూరుతాయంటే...

Published : 27 Oct 2022 00:19 IST

అగరొత్తుల్లేని ఇళ్లుండవు కదూ! దేవుడి మందిరంలోనే కాదు, తాజాదనం కోసమూ అగరొత్తులు వెలిగించుకుంటాం. వాటితో ఎన్నెన్ని లాభాలు ఒనగూరుతాయంటే...

* అగరొత్తుల పరిమళం అశాంతిని పోగొడుతుంది. అలజడి తగ్గించి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వాతావరణంలో ఉన్న కాలుష్యాలు హరిస్తాయి. స్వచ్ఛత చేకూరుతుంది.

* ప్రశాంతతను చేకూర్చడంలో అగరొత్తులు అద్భుతంగా పనిచేస్తాయి. శారీరక బడలిక, మానసిక అశాంతి లేదా ఆందోళనలను తొలగించి సేద తీరుస్తాయి. నిద్రలేమితో బాధపడేవారు స్లీపింగ్‌ పిల్స్‌ బదులు పడకగదిలో రెండు అగరొత్తులు వెలిగించుకుంటే సహజమైన మత్తు ఆవరించి హాయిగా నిద్రపడుతుంది.

* ఇందులో ఉన్న యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలతో క్రిమి కీటకాలు నశిస్తాయి. దుర్గంధాలను తరమడంలోనూ ఉపయోగపడతాయి. బోస్వెల్లిక్‌ యాసిడ్‌ రక్తసరఫరా సాఫీగా సాగేట్టు చూస్తుంది. శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

* ఆయుర్వేదంలో పరిమళ చికిత్స (అరోమా థెరపీ) ఉంది. మల్లె, గులాబీ, చందనం లాంటి అగరొత్తుల పరిమళాలతో గుండె జబ్బులతో సహా అనేక వ్యాధులూ, ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా తలనొప్పి, మైగ్రేన్‌కు ఇది గొప్ప చికిత్స. మానసిక రుగ్మతలను నయం చేయడంలోనూ ఉపయోగపడతాయి.

* వర్షాకాలంలో ముంజువాసన వస్తోందనో, అతిథులు వస్తున్నారనో రూమ్‌ ఫ్రెష్‌నర్‌ స్ప్రే చేయడం సాధారణం. అవి రసాయనభరితాలు. అగరొత్తులు వెలిగిస్తే సహజ సుగంధాలు వెదజల్లుతాయి.

* ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద మనసు కేంద్రీకరించలేకపోతే అగరొత్తులు వెలిగిస్తే ఫలితం ఉంటుంది. చుట్టూ ఆహ్లాదం పరచుకుంటుంది. మెడిటేషన్‌ సెంటర్లలో నెగెటివ్‌ ఎనర్జీని పోగొట్టేందుకు అగర్‌బత్తీలు వెలిగించడం తెలిసిందే.

* అగరొత్తుల సుగంధాలతో ఏకాగ్రత, సృజనాత్మకత పెంపొందడమే కాదు, దాతృత్వ, ఔదార్య గుణాలు అలవడతాయని, మంత్రముగ్ధులైనట్లు ఆనందిస్తారని అధ్యయనాలు నిరూపించాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్